Home / Jack Ma
వినియోగదారుల రక్షణ మరియు కార్పొరేట్ పాలనకు సంబంధించిన నిబంధనలను ఉల్లంఘించినందుకు చైనా అధికారులు బిలియనీర్ జాక్ మా స్థాపించిన ఫిన్‌టెక్ దిగ్గజం యాంట్ గ్రూప్‌కు 1 బిలియన్ డాలర్ల జరిమానా విధించారు.
చైనీస్ బిలియనీర్ అలీబాబా వ్యవస్థాపకుడు మన పొరుగున ఉన్న పాకిస్తాన్లో రహస్యపర్యటన ప్రస్తుతం పాక్‌లో హాట్ టాపిక్‌గా మారింది. నేపాల్ నుంచి పలువురు వ్యాపారవేత్తలతో కలసి ప్రత్యేక విమానంలో పాక్‌గడ్డపై దిగారు. మొత్తం 23 గంటల పాటు అక్కడ గడిపారని ఎక్స్‌ప్రెస్ ట్రైబ్యూన్ వెల్లడించింది.
Jack Ma: దాదాపు గత మూడేళ్లుగా చాలా అరుదుగా బయట కనిపిస్తున్న చైనాకు చెందిన కుబేరుడు, అలీబాబా గ్రూప్ వ్యవస్థాపకుడు జాక్ మా చాలా రోజుల తర్వాత స్వదేశంలో ప్రత్యక్షమయ్యారు. దాదాపు ఏడాదిన్నరగా విదేశాల్లో గడిపిన ఆయన తాజాగా చైనాలో అడుగుపెట్టారు. చైనా హాంగ్ జా లో తాను స్థాపించిన స్కూల్‌కు హాజరైనట్లు వార్తలు వెలువడ్డాయి. జాక్ మా రాకతో హాంకాంగ్ మార్కెట్లో అలీబాబా షేర్లు ఒక్కసారిగా పుంజుకున్నాయి. అలీబాబా గ్రూప్‌ను స్థాపించి అపరకుబేరుడిగా ఎదిగిన జాక్‌మా.. […]
బిలియనీర్లు నేటి ప్రపంచంలో, విజయానికి పర్యాయపదాలు. వారు లక్ష్యాన్ని సాధించడానికి ఇప్పటికీ నిచ్చెనపై ఉన్న లక్షలాది మందికి ప్రేరణగా మారారు. ఈ ధనవంతులను చూసినప్పుడు, వారి అపారమైన సంపదను చూసి మనం తరచుగా ఆశ్చర్యానికి లోనవుతాము.వారిలో చాలా మందికి, ఈ రోజు ఉన్న ఈ స్దాయికి రావడానికి ఎంత కష్టపడ్డారో, స్వేదాన్ని చిందించారనేది మనకు తెలియదు.