Last Updated:

ఈ కోటీశ్వరులు జీవితాన్ని జీరోతో ప్రారంభించారు..

బిలియనీర్లు నేటి ప్రపంచంలో, విజయానికి పర్యాయపదాలు. వారు లక్ష్యాన్ని సాధించడానికి ఇప్పటికీ నిచ్చెనపై ఉన్న లక్షలాది మందికి ప్రేరణగా మారారు. ఈ ధనవంతులను చూసినప్పుడు, వారి అపారమైన సంపదను చూసి మనం తరచుగా ఆశ్చర్యానికి లోనవుతాము.వారిలో చాలా మందికి, ఈ రోజు ఉన్న ఈ స్దాయికి రావడానికి ఎంత కష్టపడ్డారో, స్వేదాన్ని చిందించారనేది మనకు తెలియదు.

ఈ కోటీశ్వరులు జీవితాన్ని జీరోతో ప్రారంభించారు..

బిలియనీర్లు నేటి ప్రపంచంలో, విజయానికి పర్యాయపదాలు. వారు లక్ష్యాన్ని సాధించడానికి ఇప్పటికీ నిచ్చెనపై ఉన్న లక్షలాది మందికి ప్రేరణగా మారారు. ఈ ధనవంతులను చూసినప్పుడు, వారి అపారమైన సంపదను చూసి మనం తరచుగా ఆశ్చర్యానికి లోనవుతాము.వారిలో చాలా మందికి, ఈ రోజు ఉన్న ఈ స్దాయికి రావడానికి ఎంత కష్టపడ్డారో, స్వేదాన్ని చిందించారనేది మనకు తెలియదు. ఏమీ లేకుండా ప్రారంభించిన ఐదుగురు బిలియనీర్‌ల జాబితా ఈ విధంగా వుంది.

జాక్ మా ..

అలీబాబా వ్యవస్థాపకుడు, జాక్ మా నికర విలువ 22.8 బిలియన్ డాలర్లు.  కెఎఫ్ సి  చైనాకు వచ్చినప్పుడు, ఉద్యోగం కోసం 24 మంది దరఖాస్తు చేసుకోగా, 23 మంది సెలక్ట్ అయ్యారు. మా ఒక్కడే రిజెక్ట్ అయ్యాడు. అతను హార్వర్డ్ చేత పదిసార్లు తిరస్కరించబడ్డాడు. ఇప్పుడు, అతను ప్రపంచంలో మూడవ అతిపెద్ద ఇ-కామర్స్ ప్లాట్‌ఫారమ్‌ను కలిగి ఉన్నాడు.

ఓప్రా విన్ఫ్రే..

జాత్యహంకారం, పేదరికం మరియు లింగవివక్షను ఎదుర్కొంటూ ఓప్రా విన్ఫ్రే ఈ స్దాయికి వచ్చింది. ప్రస్తుతం దాదాపు 2.5 బిలియన్ డాలర్ల నికర విలువ కలిగిన ఓప్రా విన్‌ఫ్రే నెట్‌వర్క్ మరియు హార్పో ప్రొడక్షన్స్ యొక్క సీఈవో. ఆమె ఇప్పుడు చాలా మందికి రోల్ మోడల్

జాన్ కౌమ్

జాన్ ఉక్రెయిన్‌లోని కైవ్ వెలుపల ఉన్న ఒక చిన్న గ్రామంలో పుట్టి పెరిగాడు, ఇది ప్రస్తుతం రష్యన్ దండయాత్ర కారణంగా శిథిలావస్థలో ఉంది. అతను ప్రధానంగా కూలి పనులు చేస్తూ తన తల్లి వద్ద పెరిగాడు. ఫుడ్ స్టాంపుల కోసం లైన్‌లో వేచి ఉండే వ్యక్తి ప్రపంచంలోని అతిపెద్ద టెక్ దిగ్గజాలలో ఒకరికి అతిపెద్ద మెసేజింగ్ ప్లాట్‌ఫారమ్‌లలో ఒకదానిని విక్రయించడం ద్వారా బిలియనీర్ అవుతాడని ఎవరూ ఊహించి వుండరు. వాట్సాప్ సహ వ్యవస్థాపకుడు జాన్ కౌమ్ ఈ ప్లాట్‌ఫారమ్‌ను 19 బిలియన్ డాలర్లకు ఫేస్‌బుక్‌కు విక్రయించారు.

రితేష్ అగర్వాల్..

ఒడిశాలోని ఒక చిన్న పట్టణానికి చెందిన రితేష్ సాధారణ నేపథ్యం ఉన్న కుటుంబం నుండి వచ్చాడు. పాకెట్ మనీ సంపాదించడానికి ఒకప్పుడు సిమ్ కార్డ్‌లను విక్రయించే ఒక బాలుడు, ఇప్పుడు  బిలియన్ డాలర్ల  సంస్దకు అధిపతి. 2013లో ఓయోను స్థాపించిన రితేష్ దేశంలోని యంగెస్ట్ బిలియనీర్లలో ఒకడు.

హోవార్డ్ షుల్ట్జ్..

చాలకాలం సరైన ఆహారం లేకుండా ఇబ్బందిపడిన హోవార్డ్ ప్రపంచంలోని అత్యంత ప్రజాదరణ పొందిన కేఫ్ అయిన స్టార్‌బక్స్‌కు యజమానిగా ఎదిగాడు. ఫోర్బ్స్ నివేదిక ప్రకారం, హోవార్డ్ నికర విలువ 4 బిలియన్ డాలర్లు.

ఇవి కూడా చదవండి: