Home / Israel Defence Forces
హమాస్ టెర్రరిస్టుల చెర నుంచి నలుగురు ఇజ్రాయెల్ పౌరులను సురక్షితంగా రక్షించి స్వదేశానికి తీసుకువచ్చింది ఇజ్రాయెల్ మిలటరి. కాగా హమాస్ టెర్రరిస్టులు గత ఏడాది అక్టోబర్ 7న వీరిని సూపర్ నోవా మ్యూజిక్ ఫెస్టివల్ నుంచి కిడ్నాప్ చేసి తీసుకువెళ్లింది.
ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్ (IDF) బుధవారం నాడు గాజాలో తాము నిర్వహించిన వైమానిక దాడులలో హమాస్ ఆయుధాల ఉత్పత్తి విభాగానికి నాయకుడిగా వ్వయహరిస్తున్న కమాండర్ ను హతమార్చినట్లు తెలిపింది. ఐడిఎఫ్ ఫైటర్లు గాజా స్ట్రిప్‌లో Xఉగ్రవాదులను నిర్మూలించడం మరియు తీవ్రవాద స్దావరాలపై దాడి చేయడానికి విమానాలను ప్రయోగించాము.
హమాస్ నెట్‌వర్క్‌ను భూస్థాపితం చేయడమే లక్ష్యంగా గాజా స్ర్టిప్ పై ఇజ్రాయెల్ సాగిస్తున్న భీకర పోరులో కీలక పరిణామం చోటుచేసుకుంది. గాజాను నలువైపులా చుట్టుముట్టిన ఇజ్రాయెల్ దళాలు.. ఈ నగరాన్ని రెండుగా విభజించినట్లు ప్రకటించాయి.
ఉత్తర గాజా స్ట్రిప్‌లోని జబాలియా శరణార్థి శిబిరంపై మంగళ, బుధవారాల్లో రెండు రౌండ్ల ఇజ్రాయెల్ దాడుల్లో సుమారుగా 195 మంది పాలస్తీనియన్లు మరణించారని హమాస్ ఆధ్వర్యంలోని ప్రభుత్వ మీడియా కార్యాలయం పేర్కొంది.
ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్ (IDF) హమాస్ మిలిటెంట్లను అంతమొందించడానికి 4,000 టన్నుల బరువున్న 6,000 బాంబులను ప్రయోగించడం ద్వారా గాజా స్ట్రిప్‌పై దాడిని కొనసాగించింది. యుద్ధం యొక్క ఆరవ రోజు తెల్లవారుజామున ప్రారంభమైన ఈ ఆపరేషన్‌లో డజన్ల కొద్దీ ఫైటర్ జెట్లు, హెలికాప్టర్ గన్‌షిప్‌లు మరియు విమానాలు కూడా ఉన్నాయి.