Israel Defence Forces: హమాస్ చెర నుంచి నలుగురిని రక్షించిన ఇజ్రాయెల్ ఆర్మీ
హమాస్ టెర్రరిస్టుల చెర నుంచి నలుగురు ఇజ్రాయెల్ పౌరులను సురక్షితంగా రక్షించి స్వదేశానికి తీసుకువచ్చింది ఇజ్రాయెల్ మిలటరి. కాగా హమాస్ టెర్రరిస్టులు గత ఏడాది అక్టోబర్ 7న వీరిని సూపర్ నోవా మ్యూజిక్ ఫెస్టివల్ నుంచి కిడ్నాప్ చేసి తీసుకువెళ్లింది.
Israel Defence Forces:హమాస్ టెర్రరిస్టుల చెర నుంచి నలుగురు ఇజ్రాయెల్ పౌరులను సురక్షితంగా రక్షించి స్వదేశానికి తీసుకువచ్చింది ఇజ్రాయెల్ మిలటరి. కాగా హమాస్ టెర్రరిస్టులు గత ఏడాది అక్టోబర్ 7న వీరిని సూపర్ నోవా మ్యూజిక్ ఫెస్టివల్ నుంచి కిడ్నాప్ చేసి తీసుకువెళ్లింది. కాగా నలుగురు ఇజ్రాయెలీ పౌరులను శనివారం నాడు ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్ సెంట్రల్ గాజా స్ర్టిప్ నుంచి రక్షించింది. దీని కోసం ఇజ్రాయెల్ మిలిటరీ స్పెషల్ ఆపరేషన్ నిర్వహించింది. రక్షించిన బాధితుల విషయానికి వస్తే నోవా ఆర్గామని, అల్‌మోగ్ మియిర్‌జాన్, యాండ్రీ కోజోలోవ్, ష్లోమి జివ్‌లను గత ఏడాది సూపర్‌నోవా మ్యూజిక్ ఫెస్టివల్ నుంచి అపహరించుకుపోయారని టైమ్స్ ఆఫ్ ఇజ్రాయెల్ వెల్లడించింది.
బందీలందరినీ విడిపిస్తాం..(Israel Defence Forces)
కాగా నలుగురు బందీలు ప్రస్తుతం సురక్షితంగా ఉండటమే కాకుండా సంపూర్ణ ఆరోగ్యంగా ఉన్నారు. వారిని వైద్య పరీక్షల కోసం షెబా టెల్ హా షక్షమోర్ మెడికల్ సెంటర్‌కు తరలించారు. కాగా ఈ నలుగురిని రెండు వేర్వేరు ఆపరేషన్స్… ఐడీఎఫ్ ఐఎస్‌ఏ, ఇజ్రాయెలీ పోలీసులు నిర్వహించిన దాడుల్లో వీరిని రక్షించారు. కాగా ఈ నలుగురిని గాజా నడిబొడ్డులోని నుసుయిరత్ ప్రాంతం నుంచి రక్షించామని ఐడీఎఫ్ ఎక్స్‌లో పోస్ట్ చేసింది. ఇదిలా ఉండగా ఇజ్రాయెల్ మిలిటరీ మాత్రం హమాస్ అపహరించిన బందీలను మొత్తం విడిపించి సురక్షితంగా వారి వారి గృహాలకు చేర్చే వరకు విశ్రమించమని శపథం చేస్తున్నారు.
ఇజ్రాయెల్ మీడియాలో వస్తున్న వార్తల ప్రకారం సెంట్రల్ గాజాలో ఏకకాలంలో ఐడీఎఫ్ పెద్ద ఎత్తున దాడులకు దిగిందని, ఒక లొకేషన్‌లో ఆర్గామనిని రక్షించగా.. మిగిలిన ముగ్గురిని మరో లొకేషన్ నుంచి రక్షించామని చెప్పారు. ఇక ఆర్గామని విషయానికి వస్తే 25 ఏళ్ల చైనా జాతికి చెందిన ఇజ్రాయెల్ పౌరురాలు. కాగా సూపర్‌నోవా మ్యూజిక్ ఫెస్టివల్‌కు వెళ్లినప్పుడు కడ్నాప్‌కు గురైంది. వీడియో పుటేజీలోఆమె తన తండ్రితో కలిసిన వీడియోను ఇజ్రాయెల్ చానల్ 12లో ప్రసారం చేసింది. ప్రస్తుతం ఈ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. కాగా ఆమెను హమాస్ టెర్రరిస్టులు మోటార్ బైక్‌పై కిడ్నాప్ చేసి తీసుకువెళ్తున్పప్పుడు నన్ను చంపొద్దు అంటూ వేడుకున్న వీడియోలో యావత్ ప్రపంచం చూసింది.
ఇదిలా ఉండగా ఇజ్రాయెల్ – హమాస్ యుద్ధం తొమ్మిదో నెలకు చేరింది. ప్రపంచదేశాలు ఇజ్రాయెల్‌ను కాల్పుల విరమణకు ఒప్పుకోవాలని డిమాండ్ చేసినా ససేమిరా అంటోంది. హమాస్ అంతు చూడనిదే ఆపే ప్రసక్తి లేదని స్పష్టం చేసింది. వచ్చే ఏడాది కూడా హమాస్‌తోయుద్ధం చేస్తామంటున్నారు ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహు.