Home / interim bail
లిక్కర్ పాలసీ కుంభకోణానికి సంబంధించిన మనీలాండరింగ్ కేసులో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌కు సుప్రీంకోర్టు శుక్రవారం మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. జస్టిస్ సంజీవ్ ఖన్నా నేతృత్వంలోని ధర్మాసనం ఈ తీర్పును వెలువరించింది.
: ఆమ్ఆద్మీ పార్టీ చీఫ్ అరవింద్ కేజ్రీవాల్ మధ్యంతర బెయిల్ పొడిగించాలని సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు. అయితే ఉన్నత న్యాయస్థానం తక్షణమే పిటిషన్‌పై నిర్ణయం తీసుకోవడానికి నిరాకరించింది. కాగా పిటిషన్‌ను చీఫ్ జస్టిస్ చంద్రచూడ్‌కు బదిలీ చేశారు.
జార్ఖండ్ మాజీ సీఎం హేమంత్ సోరెన్‌కు సుప్రీంకోర్టులో చుక్కెదురైంది. లోకసభ ఎన్నికల్లో ప్రచారం చేసుకోవడానికి బెయిల్ ఇవ్వాలని ఆయన పిటిషన్ పెట్టుకున్నారు. అయితే ఆయన పిటిషన్‌ను ఉన్నత న్యాయస్థాన తిరస్కరించింది.
ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ శుక్రవారం సాయంత్రం ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో మధ్యంతర బెయిల్‌పై బయటికి వచ్చారు. కాగా శనివారం నాడు ఆయన కన్నాట్‌ప్లేస్‌లోని హనుమాన్ దేవాలయంలో పూజలు నిర్వహించారు. ఆయన వెంట భార్య సునీతా కేజ్రీవాల్, పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్‌మాన్, ఆప్ రాజ్యసభ సభ్యుడు సంజయ్ సింగ్‌తో పాటు ఢిల్లీ మంత్రి అతిషి వెంట వచ్చారు.
ఆమ్ ఆద్మీ చీఫ్ ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌కు ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో భారీ ఊరట లభించింది. సుప్రీంకోర్టు ఆయనకు జూన్ 1 వరకు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. దీంతో పాటు కేజ్రీవాల్ వచ్చే లోకసభ ఎన్నికల్లో ప్రచారం చేసుకోవడానికి అనుమతించింది.
ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో బెయిల్ కోసం చేసుకున్న దరఖాస్తుపై సుప్రీంకోర్టులో మంగళవారం వాదోపవాదాలు జరిగాయి. లోకసభ ఎన్నికల ప్రచారంలో పాల్గొనడానికి తనకు తాత్కాలిక బెయిల్ మంజూరు చేయాలని అరవింద్ కేజ్రీవాల్ సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు. అయితే సుప్రీంకోర్టు మాత్రం కేజ్రీవాల్ మధ్యంతర బెయిల్‌పై ఎలాంటి నిర్ణయాన్ని ప్రకటించలేదు.
ఆమ్ ఆద్మీపార్టీ చీఫ్ దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌కు అచ్చే దిన్ వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. లోకసభ ఎన్నికల నేపథ్యంలో సుప్రీంకోర్టు ఆయనకు మధ్యంతర బెయిల్ ఇచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. అంతకు ముందు సుప్రీంకోర్టు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్‌ను 2024 లోకసభ ఎన్నికలకు ముందు అరెస్టు చేయాల్సిన అవసరం ఎందుకు వచ్చిందని ప్రశ్నించింది.
మహిళా రెజ్లర్లపై లైంగిక వేధింపులకు పాల్పడిన కేసులో డబ్ల్యూఎఫ్ఐ మాజీ చీఫ్ బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్‌కు ఢిల్లీ కోర్టు మంగళవారం 2 రోజుల మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్ రెగ్యులర్ బెయిల్ పిటిషన్‌పై కోర్టు గురువారం వాదనలు విననుంది.