Home / Interest rates
ప్రభుత్వ రంగానికి చెందిన స్టేట్ బ్యాంకు ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) ఫిక్స్డ్ డిపాజిట్ రేట్లను ఈ నెల 15 నుంచి పెంచింది. వివిధ కాల పరిమితులపై 25 నుంచి 75 బేసిస్ పాయింట్లు లేదా 0.25 శాతం నుంచి 0.75 శాతం వరకు రూ.2 కోట్లు అంత కంటే తక్కువ మొత్తానికి వడ్డీరేట్లను పెంచింది.
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రెపో రేటును 6.5% వద్ద యథాతథంగా ఉంచిందని, పరిస్థితి అవసరమైతే చర్య తీసుకోవడానికి సిద్ధంగా ఉందని ఆర్బిఐ గవర్నర్ శక్తికాంత దాస్ ప్రకటించారు. మొత్తం ద్రవ్యోల్బణం లక్ష్యం కంటే ఎక్కువగా ఉందని, ప్రస్తుత పాలసీ రేటు ఇప్పటికీ అనుకూలంగానే ఉందని ఆయన తెలియజేశారు.
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) వడ్డీ రేట్లను మరోసారి పెంచింది. రెపో రేట్ 50 బేసిస్ పాయింట్లు పెంచింది. ఈ క్రమంలో రెపో రేట్ 5.40 నుంచి 5.90 శాతానికి పెరిగింది. కాగా, గడిచిన ఐదు నెలల్లో 190 బేసిస్ పాయింట్లు పెరిగింది.