Home / Indrakiladri
ఇంద్రకీలాద్రిపై దసరా శరన్నవరాత్రి మహోత్సవాలు ప్రారంభమయ్యాయి. ఈ నెల 23 వరకు దసరా మహోత్సవాలు జరగనున్నాయి. తొమ్మిది రోజుల పాటు పది అలంకారాలలో కనకదుర్గమ్మ దర్శనమివ్వనున్నారు. తొలిరోజు శ్రీ బాలాత్రిపుర సుందరీ దేవి అలంకారంలో అమ్మవారు భక్తులకు దర్శనమివ్వనున్నారు.
దశరా శరన్నవ రాత్రుల్లో విజయవాడలో ఘనంగా చేపట్టే దుర్గ మల్లేశ్వర స్వామి నిర్వహించే తెప్పోత్సవాన్ని రద్దు చేశారు. ప్రకాశం బ్యారేజ్ కి ఎగువనున్న పులిచింతల ప్రాజెక్ట్ నుండి నీరు వస్తుండడంతో ఈమేరకు నిర్వాహక కమిటి ఈమేరకు నిర్ణయం తీసుకొనింది
కనకదుర్గమ్మ అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించేందుకు సీఎం జగన్ ఇంద్రకీలాధ్రికి విచ్చేసారు. ఆయన వచ్చి వెళ్లేంతవరకు దర్శనాలు నిలిపివేశారు. దీంతో దుర్గమ్మ దర్శనం కోసం భక్తులు గంటల తరబడి పడిగాపులు కాశారు. క్యూలైన్లలో పెద్దలు, చిన్నారులు, మహిళలు అవస్ధలు పడ్డారు. సీఎం జగన్ డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు.