Home / INDIA alliance
ప్రధానమంత్రి నరేంద్రమోదీ బిహార్ ఎన్నికల ప్రచారంలో బిజీబిజీగా ఉన్నారు. శనివారం ఆయన పాటలిపుత్రలో ఎన్నికల ర్యాలీలో పాల్గొన్నారు. ఇండియా కూటమిపై తన దైన శైలిలో విమర్శలు గుప్పించారు. ఓట్లు దండుకోవడానికి ఓటర్లను ప్రసన్నం చేసుకోవడానికి ముజ్రా చేయడానికి కూడా కూటమి సిద్దంగా ఉందని ఎద్దేవా చేశారు.
ఇండియా కూటమిపై ప్రధాని మోదీ విమర్శలు గుప్పించారు. ఈ సారి అధికారంలోకి వస్తే.. ఏడాదికి ఒక ప్రదానిని తీసుకువస్తారని అన్నారు. ఐదు సంవత్సారాలలో ఐదు మంది ప్రధానలు మారుతారు . అంటే దేశ ప్రగతిని అధోగతి పాలు చేయబోతున్నారని ప్రధాని విమర్శించారు. వరంగల్‌లో నిర్వహించిన బీజేపీ బహిరంగ సభలో ప్రధాని మోదీ పాల్గొన్నారు.
ఇండియన్ నేషనల్ డవలప్మెంట్ ఇన్‌క్లూజివ్ అలయెన్స్ కూటమి నాలుగవ సమావేశం న్యూఢిల్లీలోని అశోక హోటళ్లో మంగళవారం మొదలైంది. కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లిఖార్జున్ ఖర్గే, పార్టీ మాజీ అధ్యక్షులు సోనియాగాంధీ, రాహుల్ గాంధీ, ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్, ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్, లాలూ ప్రసాద్ యాదవ్, జేడీయూ చీఫ్ నితీష్ కుమార్, టీఎంసీ చీప్ మమతా బెనర్జీ, డీఎంకే అధ్యక్షుడు ఎం.కె.స్టాలిన్, సీపీఎం నేత సీతారాం ఏచూరి, తదితరులు పాల్గొన్నారు.
దేశంలోని ప్రతిపక్షాలు తమ ఫ్రంట్ పేరుగా 'ఇండియా'ను ప్రకటించిన ఒక రోజు తర్వాత, 2024 సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీని ఓడించడమే లక్ష్యంగా పెట్టుకున్న కూటమికి ట్యాగ్‌లైన్‌గా 'జీతేగా భారత్'ను ఎంచుకున్నారు.గత రాత్రి జరిగిన చర్చల తర్వాత జీతేగా భారత్ (భారత్ గెలుస్తుంది)పై తుది నిర్ణయం తీసుకున్నారు. ఈ ట్యాగ్‌లైన్ అనేక ప్రాంతీయ భాషల్లో ఉండే అవకాశం ఉందని తెలుస్తోంది.