Home / heavy rains
గత మూడురోజులుగా తెలంగాణాలో ఓ మోస్తారు నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. కాగా రేపు కూడా పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం సూచించింది.
బెంగళూరు నగర శివారులో భారీ వర్షాలు కురిసి నగరాన్ని ముంచెత్తడంతో పడవలను మోహరించారు. ఐటీ హబ్ ప్రాంతాలైన ఎలక్ట్రానిక్ సిటీ, మారతహళ్లి, ఔటర్ రింగ్ రోడ్, మహదేవపుర, వైట్‌ఫీల్డ్ మరియు బొమ్మనహళ్లి ప్రాంతాలు ఎక్కువగా వరదకు ప్రభావితమయ్యాయి.
భారీ వర్షాలతో బెంగళూరు అతలాకుతలమయింది. ప్రజలను ఖాళీ చేయడానికి తెప్పలను పంపమని అధికారులను ప్రేరేపించారు. బెల్లందూర్, సర్జాపురా రోడ్, వైట్‌ఫీల్డ్, ఔటర్ రింగ్ రోడ్ మరియు బిఈఎంఎల్ లే అవుట్ వంటి ప్రాంతాలు ఎక్కువగా వరదనీటిలో చిక్కుకున్నాయి.
ఆప్ఘనిస్తాన్ లో భారీ వర్షాలకు కనీసం 20 మంది మృతి చెందారు. సుమారు 3వేల కంటే ఎక్కువ ఇళ్లు ధ్వంసమయ్యాయి. శనివారం తూర్పు ఆప్ఘనిస్తాన్ లోని లోగార్ ప్రావిన్స్‌లో పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిశాయి. ప్రావిన్స్‌లో 30 కంటే ఎక్కువ మంది గాయపడ్డారని ప్రావెన్స్
హిమాచల్ ప్రదేశ్‌లో భారీ వర్షాల కారణంగా సంభవించిన ఆకస్మిక వరదలు మరియు కొండచరియలు విరిగిపడటంతో ఆరుగురు మరణించగా 13 మంది గల్లంతయ్యారు. రాష్ట్రంలోని హమీర్పూర్ జిల్లాలో వరదల కారణంగా చిక్కుకుపోయిన 22 మందిని సురక్షితంగా తరలించినట్లు
జమ్మూ కశ్మీర్ లోని రియాసి జిల్లా కత్రా లో కురుస్తున్న భారీ వర్షాలతో జన జీవనం స్తంభించింది. వరదల కారణంగా మాతా వైష్ణోదేవి ఆలయం సమీపంలో రోడ్లన్నీ నీట మునిగాయి. దీంతో మాతా వైష్ణోదేవి తీర్థయాత్రను తాత్కాలికంగా రద్దు చేశారు.
బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం బలహీనపడ్డింది. పశ్చిమ బెంగాల్, ఉత్తర ఒడిశా ప్రాంతంలో కేంద్రీకృతమైంది. ఇది పశ్చిమ వాయువ్య దిశగా కదిలి.. కొన్ని గంటల్లో తీరం దాటే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది.
భద్రాచలం వద్ద గోదావరి వరద ఉధృతి పెరుగుతుంది. నిన్న50.50 అడుగులు ఉన్న గోదావరి ప్రవాహం ఈరోజు 51.60 అడుగులకు చేరింది. కాగా భద్రాచలం దగ్గర రెండో ప్రమాద హెచ్చరిక జారీ చేశారు అధికారులు. 13 లక్షల 49 వేల 465 క్యూసెక్కుల వరద నీరు దిగువకు విడుదల చేశారు.
దక్షిణ కొరియా రాజధాని సియోల్‌ను భారీ వరదలు ముంచెత్తాయి. సోమవారం రాత్రి కుంభవృష్టి కురియడంతో పల్లపు ప్రాంతాల్లో నీరు చేరింది. ఈ వరదల్లో ఇప్పటి వరకు 8 మంది మృతి చెందగా, 14 మంది గాయపడ్డారు. భారీ వర్షాలకు నగరంలోని వివిధ ప్రాంతాల్లో ట్రాఫిక్ నిలిచిపోయింది. చాలా చోట్ల రోడ్లపై కార్లు
తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు దంచికొడుతున్నాయి. విస్తారంగా కురుస్తున్న వర్షాలకు వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. ప్రాజెక్టులన్నీ నిండుకుండలా మారాయి. విస్తారంగా కురుస్తున్న వర్షాలకు జనజీవనం అస్థవ్యస్థంగా మారింది. భారీ వర్షాల నేపథ్యంలో రెండు రాష్ట్రాల్లోని అధికారులు అప్రమత్తం అయ్యారు.