Home / heavy rains
గత కొద్దిరోజులుగా అల్పపీడన ప్రభావంతో రాష్ట్రంలో అక్కడక్కడ వర్షాలు కురుస్తూనే ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే మరల అమరావతి వాతావరణ కేంద్రం ఏపీకి మరో మూడురోజుల పాటు వర్ష సూచన ఉందని తెలిపింది. నేడు, రేపు, ఎల్లుండి రాష్ట్రంలో వర్షాలు పడే అవకాశం ఉందని పేర్కొనింది.
ఉత్తర్ ప్రదేశ్‌లో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. లక్నోలోని దిల్కుషా ప్రాంతంలో నిర్మాణంలో ఉన్న ఓ ఇంటి గోడ కూలిన ఘటనలో తొమ్మిది మంది దుర్మరణం చెందారు. పలువురు తీవ్రంగా గాయపడ్డారు. గమనించిన స్థానికులు శిథిలాల కింద చిక్కుకున్న వారిని రక్షించేందుకు ప్రయత్నించారు.
ఆంధ్రప్రదేశ్ లోని ఉత్తరాంధ్రప్రాంతంలో భారీవర్షాలు కురుస్తున్నాయి. శ్రీకాకుళం జిల్లాలో కుండపోతగా వర్షం కురిసింది. గార మండలంలో దాదాపు 15 సెంటీ మీటర్ల వర్షం పడగా, శ్రీకాకుళంలో 7, ఆమదాలవలసలో 6, నరసన్నపేటలో 4 సెంటీ మీటర్లకు పైగా వర్షపాతం నమోదైంది.
తెలంగాణ పై అల్పపీడన ప్రభావం కొనసాగుతోంది. హైదరాబాద్ సహా జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఇవాళ కొన్ని చోట్ల అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ ప్రకటించింది. హైదరాబాద్ కు ఎల్లో అలర్ట్, 19 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ ప్రకటించింది
ఇప్పటికే తెలుగు రాష్ట్రాల్లోని చాలా ప్రాంతాలు జలదిగ్బంధంలో కూరుకుపోయి ఉన్నాయి. కాగా రాష్ట్రంలో మరో మూడు రోజులపాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది.
కృష్ణాజిల్లాలోని ప్రకాశం బ్యారేజ్‌కు వరద ప్రవాహం కొనసాగుతుంది. దీనితో ప్రాజెక్టు అధికారులు జలాశయం యొక్క 70గేట్లు పూర్తిగా ఎత్తి వరదనీటిని విడుదల చేస్తున్నారు.
భారీ వర్షాలు, వరదలు ఉత్తరాఖండ్ ను అతలాకుతలం చేస్తున్నాయి. లోతట్టు ప్రాంతాల్లోని ఇళ్లు నీటమునిగాయి. పిథోరగఢ్, ధార్చుల పట్టణంలో వరదలతో భారీగా నష్టం వాటిల్లింది. వరదలకు కాళి నది పొంగి పొర్లుతున్నది. దీంతో ఆ నది ఒడ్డున ఉన్న పలు ఇండ్లు దెబ్బతిన్నాయి.
తెలుగు రాష్ట్రాల్లో గత కొద్దిరోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. కొన్ని ప్రాంతాల్లో ఈదురుగాలులు మరికొన్ని ప్రాంతాల్లో పిడుగులుపడ్డాయి. కాగా పెద్దపల్లి జిల్లాలో పిడుగుపాటుకు 9 మూగజీవాలు మృతి చెందాయి.
భారతదేశం సిలికాన్ వ్యాలీ గా పేరుగాంచిన బెంగళూరు నగరం దేశంలోని ప్రముఖ సమాచార సాంకేతిక ఎగుమతిదారుగా ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందింది. ఈ నగరం, గత కొన్ని రోజులుగా భారీ వర్షాలకు అతలాకుతలమయింది.
గత నాలుగు రోజులుగా అటు తెలంగాణ ఇటు ఆంధ్రప్రదేశ్ లో కురుస్తు వర్షాలు జనజీవనాన్ని స్తంభింపజేస్తున్నాయి. కాగా ఈ వానల దాటికి చెరువులు వాగులు వంకలు పొంగిపొర్లుతున్నాయి. నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ కు వరద నీటి ప్రవాహం కొనసాగుతుంది.