Home / Hawala money
విశాఖపట్నంలో వాషింగ్ మిషన్ లో భారీగా కరెన్సీ పట్టుబడడం రాష్ట్ర వ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారింది. సుమారు రూ. కోటీ 30 లక్షలతో పాటు.. 30 సెల్ ఫోన్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ నగదును విజయవాడ తరలిస్తుండగా ఎయిర్ పోర్టు జోన్ పోలీసులు పట్టుకోగా.. ఇది హవాలా మనీగా పోలీసులు భావిస్తున్నట్లు సమాచారం అందుతుంది.
హైదరాబాదు నగరంలో మరో మారు భారీగా హవాలా సొమ్ము పోలీసులకు పట్టుబడింది. మునుగోడు ఉప ఎన్నికల నేపథ్యంలో తనిఖీల చేస్తున్న టాస్క్ ఫోర్స్ సిబ్బందికి ఈ నగదు పట్టుబడింది.
హైదరాబాదు కేంద్రంగా హవాలా రాకెట్ కోట్లల్లో సాగుతుంది. ఇప్పటివరకు దీనిపై పోలీసులు ప్రత్యక దృష్టి పెట్టలేదు. తాజాగా మునుగోడు ఉప ఎన్నికల్లో భాగంగా టాస్క్ ఫోర్సు పోలీసులు తనిఖీల నేపథ్యంలో హైదరాబాదులో పలు హవాలా ముఠాలు ఉన్నట్లు తేలుతుంది.
హవాలా నగదుకు లావాదేవీలకు దొంగ మార్గం. దీన్ని నిరోధించేందుకు నిత్యం ప్రభుత్వ వర్గాలు శ్రమిస్తుంటాయి. అయినా దొడ్డిదారిన హవాలా చేస్తున్న వ్యక్తులు కోకొల్లలు. తాజాగా హైదరాబాదులో రూ. 3.5 కోట్ల రూపాయల హవాలా నగదును పోలీసులు స్వాధీనం చేసుకొన్నారు