Last Updated:

Cash In Washing Machine : విశాఖలో షాకింగ్ ఘటన.. వాషింగ్ మిషన్ లో కోటీ 30 లక్షలు పట్టుకున్న పోలీసులు

విశాఖపట్నంలో వాషింగ్ మిషన్ లో భారీగా కరెన్సీ పట్టుబడడం రాష్ట్ర వ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారింది. సుమారు రూ. కోటీ 30 లక్షలతో పాటు.. 30 సెల్ ఫోన్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ నగదును విజయవాడ తరలిస్తుండగా ఎయిర్ పోర్టు జోన్ పోలీసులు పట్టుకోగా..  ఇది హవాలా మనీగా పోలీసులు భావిస్తున్నట్లు సమాచారం అందుతుంది. 

Cash In Washing Machine : విశాఖలో షాకింగ్ ఘటన.. వాషింగ్ మిషన్ లో కోటీ 30 లక్షలు పట్టుకున్న పోలీసులు

Cash In Washing Machine : విశాఖపట్నంలో వాషింగ్ మిషన్ లో భారీగా కరెన్సీ పట్టుబడడం రాష్ట్ర వ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారింది. సుమారు రూ. కోటీ 30 లక్షలతో పాటు.. 30 సెల్ ఫోన్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ నగదును విజయవాడ తరలిస్తుండగా ఎయిర్ పోర్టు జోన్ పోలీసులు పట్టుకోగా..  ఇది హవాలా మనీగా పోలీసులు భావిస్తున్నట్లు సమాచారం అందుతుంది.

ఈ ఘటనలో పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. విశాఖలోని ఎన్ఏడీ జంక్షన్ వద్ద తనిఖీలు నిర్వహిస్తున్న పోలీసులు అనుమానాస్పదంగా ఉన్న వాషింగ్ మిషన్ల (Cash In Washing Machine) ను తరలిస్తున్న ఓ ఆటోని ఆపి తనిఖీలు నిర్వహించారు.  సదరు డ్రైవర్ ని డెలివరీ గురించి ప్రశ్నించగా సరైన సమాధానాలు చెప్పకపోవడంతో పోలీసులు అనుమానంతో తనిఖీ చేయగా ప్యాక్ చేసిన ఉన్న వాషింగ్ మిషన్ లో రూ.కోటీ30 లక్షలు క్యాష్, 30 సెల్ ఫోన్లు ఉండటం చూసి ఆశ్చర్యపోయారు. దాంతో అ అదరైవర్ ను అదుపులోకి తీసుకొని.. ఆటోను సీజ్ చేశారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు.  కాగా గతంలో కూడ విశాఖపట్టణంలో హవాలా నగదును పోలీసులు సీజ్ చేసిన ఘటనలు నమోదయ్యాయి.

గతంలో నమోదైన పలు కేసులు.. 

2017 మే 13న తణుకులో షెల్ కంపెనీల ద్వారా రూ. 570 కోట్లను తరలించిన తొమ్మిది మందిపై విశాఖపట్టణం పోలీసులు పట్టుకున్నారు.

2021 జనవరి 11న విశాఖ నగరంలోని తెలుగుతల్లి ఫ్లైఓవర్ వద్ద ఓ వ్యక్తి నుండి రూ. 70 లక్షలను పోలీసులు సీజ్ చేశారు. ఈ నగదుకు సంబంధించిన పత్రాలు లేకపోవడంతో పోలీసులు సీజ్ చేశారు. శ్రీనివాస్, రోషన్ కుమార్ జైన్ అనే ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు.

2022 మే 18న విశాఖపట్టణంలోని నక్కపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో మూడు కోట్ల నగదును తరలిస్తున్న వ్యక్తిని పోలీసులు  అరెస్ట్ చేశారు. బి.శ్రీనివాసరావు అనే వ్యక్తి ఈ నగదును తరలిస్తున్న విషయమై కచ్చితమైన సమాచారం ఆధారంగా పోలీసులు శ్రీనివాసరావును పోలీసులు అరెస్ట్ చేశారు.