Home / Hariramajogaiah
మాజీ ఎంపీ ,కాపు ,బలిజ సంక్షేమ సేన అధ్యక్షుడు చేగొండి హరిరామ జోగయ్య తాజాగా మరో బహిరంగ లేఖ రాశారు.వైసీపీ కానీ , తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి కానీ తమ ఎన్నికలు మేనిఫెస్టోలలో కాపు, బలిజ, తెలగ, ఒంటరి కులస్తులకు జనాభా ప్రాతిపదికన 5 శాతం విద్య, ఉద్యోగాలలో రిజర్వేషన్స్ కలుగచేసే అంశం లేకపోవటం దురదృష్టకరమని అన్నారు .
ఏపీ లో ప్రతి సాధారణ ఎన్నికలలో కులాలే విజయావకాశాలు శాసిస్తున్నాయని ,జనసేనాని పవన్ కళ్యాణ్ నినాదం అయిన బై బై వైసీపీ నిజం కావాలంటే కాపుల ఓట్లే కీలకమని మాజీ ఎంపీ చేగొండి హరిరామ జోగయ్య అన్నారు . ఈ మేరకు ఆయన ఒక లేఖ విడుదల చేసారు . రాష్ట్రంలో ప్రస్తుతం 45శాతం బి.సి. లు ,18శాతం కాపులు, 16శాతం ఎస్.సి.లు, 6 శాతం ఎస్.టి.లు ,6శాతం రెడ్లు, 4శాతం కమ్మ 5శాతం యితరులు ఉన్నారని పేర్కొన్నారు