Home / Hafiz Saeed
ముంబై ఉగ్రదాడి సూత్రధారి, చట్టవిరుద్ధమైన జమాత్ ఉద్ దవా చీఫ్ హఫీజ్ సయీద్ పాకిస్థాన్‌లో 78 ఏళ్ల జైలు శిక్ష అనుభవిస్తున్నాడని ఐక్యరాజ్యసమితిపేర్కొంది. అతను ఏడు తీవ్రవాద ఫైనాన్సింగ్ కేసులలో శిక్షను ఎదుర్కొంటున్నాడు.
లష్కరే తోయిబా (ఎల్ఈటీ) వ్యవస్థాపకుడు, 26/11 ముంబై దాడుల సూత్రధారి హఫీజ్ సయీద్‌ను అప్పగించాల్సిందిగా భారత ప్రభుత్వం పాకిస్థాన్‌ను అధికారికంగా అభ్యర్థించింది.సయీద్‌ను అప్పగించేందుకు చట్టపరమైన ప్రక్రియను ప్రారంభించాలని కోరుతూ విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ పాక్ ప్రభుత్వానికి అధికారిక అభ్యర్థనను పంపినట్లు వర్గాలు ధృవీకరించాయి.
పాకిస్తాన్ ఉగ్రవాద సంస్థ లష్కరే తోయిబా (ఎల్ఇటి) మోస్ట్ వాంటెడ్ నాయకులలో ఒకరిని కరాచీలో గుర్తు తెలియని వ్యక్తులు కాల్చి చంపారని పాకిస్తాన్ మీడియా నివేదించింది.26/11 ముంబై దాడి సూత్రధారి హఫీజ్ సయీద్ సన్నిహితుడు ముఫ్తీ ఖైజర్ ఫరూక్ ను కరాచీలో గుర్తు తెలియని వ్యక్తులు కాల్చి చంపారు.