Home / Gotabaya Rajapaksa
తీవ్ర ఆర్థిక సంక్షోభానికి కారకుడయ్యారనే ఆరోపణలతో ప్రజల ఆగ్రహానికి గురై విదేశాలకు పారిపోయిన శ్రీలంక మాజీ అధ్యక్షుడు గొటబాయ రాజపక్స శుక్రవారం సొంత గడ్డ పై కాలు మోపారు. దాదాపు 50 రోజుల ప్రవాసం తర్వాత స్వదేశానికి తిరిగి వచ్చారు. గొటబాయకు బంగళా, 24 గంటలపాటు భద్రత కల్పించేందుకు లంక ప్రభుత్వం
శ్రీలంక మాజీ అధ్యక్షుడు గొటబాయ రాజపక్స తాత్కాలికంగా నివసించేందుకు థాయిలాండ్ ప్రభుత్వం అనుమతించింది. ప్రస్తుతం సింగపూర్‌లో ఉంటున్న రాజపక్స వీసా నేటితో ముగిసిపోతుంది. కాబట్టి సింగపూర్ నుంచి వేరే ఇతర దేశానికి మకాం మారాల్సిన పరిస్థితి ఏర్పడింది.
శ్రీలంక ప్రధాని రణిల్ విక్రమసింఘేను తాత్కాలిక అధ్యక్షుడిగా లంక స్పీకర్ మహింద అబెవర్ధన బుధవారం నియమించారు. ప్రస్తుత అధ్యక్షుడు గొటబయ రాజపక్స దేశం వీడి వెళ్లడంతో ప్రజలు పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు. రాజపక్స ఇంతవరకూ తన పదవికి రాజీనామా చేయలేదు. మరోవైపు రాజ్యాంగంలోని 37(1) నిబంధన కింద రణిల్ విక్రమసింఘే
ఆర్థిక, రాజకీయ సంక్షోభంతో అల్లాడిపోతున్న శ్రీలంకలో తీవ్ర నాటకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయి. అధ్యక్షుడు గొటబాయ రాజపక్సే సతీ సమేతంగా దేశం విడిచి పారిపోయాడు. తొలుత వాయు, జల మార్గాల ద్వారా దేశం నుంచి పారిపోయేందుకు యత్నించిన రాజపక్సేకు.. అధికారులు ఏమాత్రం సహకరించలేదు. అడుగడుగున అడ్డుకున్నారు.
వారు నలుగురు అన్నదమ్ములు. కలసికట్టుగా ఉంటారు. రాజకీయాల్లో రాణిస్తుంటారు. అలా అని ప్రజలకు ఎలాంటి సాయం చేయరు. తమ కుటుంబ ఆస్తులను పెంచుకునేందుకు నిత్యం ప్రయత్నిస్తుంటారు. చివరకు తమను నమ్ముకున్న దేశ ప్రజలకు కనీసం అన్నం కూడా పెట్టలేదు. ఆకలిమంటల్లో అల్లాడుతున్న ప్రజలు తిరుగుబాటు చేయడంతో పలాయనం చిత్తగించారు.
శ్రీలంకలో ఆర్థిక సంక్షోభం తీవ్రంగా పెరిగిపోయింది. దీంతో ఆ దేశ అధ్యక్షుడు గొటబాయ రాజపక్స రాజీనామా చేయాలని దేశవ్యాప్తంగా నిరసనలు మిన్నంటాయి. నిరసనకారులు కొలంబోలోని రాజపక్స ఇంటిని చుట్టుముట్టారు. దీంతో గొటబాయ వారినుంచి తప్పించుకుని పరారయ్యారు. ఆందోళనకారులపై లంక సైన్యం టియర్ గ్యాస్ ప్రయోగించింది.