Home / Godavari Floods Alert
తూర్పు గోదావరి జిల్లా దవళేశ్వరం బ్యారేజ్‌లో గోదావరి వరద ఉదృతి పెరిగింది. 4 లక్షల 10 వేల క్యూసెక్కుల నీరు చేరింది. దీంతో బ్యారేజ్‌లోని 175 గేట్లను ఎత్తి నీటిని విడుదల చేస్తున్నారు. ఉభయ గోదావరి డెల్టాల నుంచి ప్రధాన పంటకాల్వలకు 6 వేల 850 క్యూసెక్కుల నీరు చేరుతోంది. మరోపక్క పోలవరం ప్రాజెక్ట్ స్పిల్ వే 48 గేట్ల ద్వారా ధవళేశ్వరం బ్యారేజ్‌కు నీటిని విడుదల చేస్తున్నారు.