Home / Godavari flood
ఇటీవల గోదావరికి భారీగా వరద నీరు రావడంతో పోలవరం ప్రాజెక్టు ఎత్తు పెంచాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. 40. 5 మీటర్లు ఉన్న కాపర్ డ్యాంను 43.5 మీటర్లకు పెంచాలని నిర్ణయించింది. అనుకున్నదే ఆలస్యం. చకచకా పనులు ప్రారంభించి, రెండు రోజుల్లోని పూర్తి చేసింది ఏపీ సర్కార్.
తెలంగాణలో వరద బాధిత ప్రాంతాల్లో పర్యటించాక సీఎం కేసీఆర్ మీడియాతో మాట్లాడుతూ భారీ వర్షాలు, వరదల పై సంచలన వ్యాఖ్యలు చేశారు. కడెం ప్రాజెక్టు వద్ద కనీవినీ ఎరుగని వరదను చూశాం. క్లౌడ్ బరస్ట్ కారణంగానే అలా అకస్మాత్తు వరదలు వస్తాయి.
తూర్పు గోదావరి జిల్లా దవళేశ్వరం బ్యారేజ్‌లో గోదావరి వరద ఉదృతి పెరిగింది. 4 లక్షల 10 వేల క్యూసెక్కుల నీరు చేరింది. దీంతో బ్యారేజ్‌లోని 175 గేట్లను ఎత్తి నీటిని విడుదల చేస్తున్నారు. ఉభయ గోదావరి డెల్టాల నుంచి ప్రధాన పంటకాల్వలకు 6 వేల 850 క్యూసెక్కుల నీరు చేరుతోంది. మరోపక్క పోలవరం ప్రాజెక్ట్ స్పిల్ వే 48 గేట్ల ద్వారా ధవళేశ్వరం బ్యారేజ్‌కు నీటిని విడుదల చేస్తున్నారు.