Home / Global Investors Summit
జీఐఎస్ ద్వారా రాష్ట్రానికి మొత్తం రూ. 13 లక్షల 5 వేల 663 కోట్ల పెట్టుబడులకు ఒప్పందాలు కుదిరాయి అని ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి వ్యాఖ్యానించారు. ఈ సదస్సులో భాగంగా ఈరోజు విశాఖ ఏయూ గ్రౌండ్స్‌లో పలు నూతన పారిశ్రామిక యూనిట్లను ప్రారంభించారు. అనంతరం ఆయన ముగింపు ప్రసంగం ఇచ్చారు. ఈ మేరకు జగన్ మాట్లాడుతూ..
ఆంధ్రప్రదేశ్ సంస్కృతి, సంప్రదాయాలకు నిలయమని.. ఏపీలో కీలక రంగాల్లో వనరులు పుష్కలంగా ఉన్నాయని రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ తెలిపారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పెట్టుబడులే ధ్యేయంగా రాష్ట్ర ప్రభుత్వం "గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ 2023" కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఇందుకు సంబంధించి గత కొద్ది రోజులుగా భారీ ఏర్పాట్లు చేశారు. కాగా విశాఖపట్నం వేదికగా “గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ 2023” అట్టహాసంగా ప్రారంభమైంది.
విశాఖపట్నం వేదికగా "గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ 2023" అట్టహాసంగా ప్రారంభమైంది. ఆంధ్రా యూనివర్సిటీ ఇంజినీరింగ్ కాలేజీ ప్రాంగణంలోని 50 ఎకరాల విస్తీర్ణంలో ఈ సదస్సు నిర్వహిస్తున్నారు. సదస్సు ప్రారంభం సందర్భంగా రాష్ట్ర గీతం అయిన ‘మా తెలుగు తల్లికి మల్లెపువ్వు దండ..’ గీతాన్ని మొదటగా ఆలపించారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ నెల 3, 4 తేదీల్లో జరగనున్న “గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్”కు ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. విశాఖపట్నం లోని ఆంధ్ర విశ్వవిద్యాలయం ఇంజినీరింగ్ కాలేజ్ గ్రౌండ్స్‌లో ఈ సమ్మిట్ నిర్వహించనున్నారు.