Home / Ganta Srinivasa Rao
టీడీపీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు రాజీనామా ఆమోదం పొందింది. గంటా రాజీనామాను స్పీకర్ తమ్మినేని సీతారాం ఆమోదించారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా చాలా కాలం క్రితమే గంటా శ్రీనివాసరావు రాజీనామా చేశారు. రాజ్యసభ ఎన్నికల ముందు గంటా శ్రీనివాసరావు రాజీనామాకు స్పీకర్ ఆమోదం తెలపడం హాట్ టాపిక్‌గా మారింది.
ఏపీలో ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలు దాదాపు తెలిసిపోయాయి. ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకుండా చూడాలని పవన్ కళ్యాణ్ చెప్పిన విషయం ఈ ఎన్నికల్లో రుజువైందని గంటా విశ్లేషించారు. రాజధాని వ్యవహారం సహా వైసీపీ చెప్పిన మాటలకు ప్రజల్లో విశ్వాసం లభించలేదన్నారు. మూడేళ్ల క్రితం దాదాపు 50 ఓటింగ్ సాధించిన వైసీపీ ఇప్పుడు 30శాతంకు పడిపోయిందన్నారు.
మాజీ మంత్రి, తెలుగుదేశం పార్టీ నేత గంటా శ్రీనివాస రావు నేడు విశాఖలోని నోవాటెల్ కి వెళ్లి అక్కడ జనసేనానికి కలిశారు. దీనితో పవన్ తో గంటా చేరనున్నారనే ప్రచారం జరుగుతుంది. దీనిపై ఇంతవరకు ఇద్దరు నేతలు స్పందించలేదు. కానీ ఏపీ రాజకీయాలు చూస్తుంటే ఏక్షణం ఏమైనా జరగొచ్చు అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. మరి గంటా జనసేనానితో చేతులు కలిపితే ఉత్తరాంధ్రలో వైసీపీకి చుక్కలు తప్పవు అనే గుసగుసలు వినిపిస్తున్నాయి.