Home / foot ball world cup
ఫుట్‌బాల్ అనేది ఆట మాత్రమే కాదు, ఒక భావోద్వేగం. ఇప్పుడు, అందరి దృష్టి ఫిఫా ప్రపంచ కప్ ఫైనల్‌పై ఉంది.
ఫిఫా ప్రపంచ కప్ టోర్నమెంట్ తుది దశకు చేరింది. ఆదివారం ప్రపంచ కప్ ఫైనల్ మ్యాచ్ లో ఫ్రాన్స్ అర్జెంటీనా జట్లు తలపడనున్నాయి. కాగా కప్ కొట్టి తన కెరీర్ కు ఘనమైన వీడ్కోలు పలకాలని ఆశిస్తున్న అర్జెంటీనా దిగ్గజం లియోనల్ మెస్సీ ఆశ చెదిరేలా కనిపిస్తోంది.
ఖతార్‌లో జరుగుతున్న ఫిఫా ప్రపంచ కప్-2022 టోర్నమెంట్ తుది దశకు చేరుకుంది. బుధవారం రాత్రి జరిగిన రెండో సెమీఫైనల్ మ్యాచ్ లో ఆఫ్రికా దేశమైన మొరాకోపై ఫ్రాన్స్ ఘన విజయం సాధించింది. దీనితో డిఫెండింగ్ ఛాంపియన్ ఫ్రాన్స్ రెండోసారి ఫైనల్ కు చేరింది.
ఫిఫా వరల్డ్ కప్ టోర్నీలను ప్రపంచమంతా ఎంతో ఆసక్తిగా చూస్తోంది. కాగా ఈ టోర్నీలో నిన్న ఖతార్ వేదికగా జరిగిన అర్జెంటీనా, నెదర్లాండ్స్ మ్యాచ్ ఆధ్యంతం ఉత్కంఠగా సాగింది. ఈ మ్యాచ్ లో సూపర్ స్టార్ లియోనెల్ మెస్సీ.. మరోసారి తన సత్తా చాటాడు. అర్జెంటీనాకు నాయకత్వం వహిస్తున్న మెస్సీ.. పెనాల్టీ షూటవుట్‌లో నెదర్లాండ్స్‌ను ఓడించి, తమ జట్టును సెమీఫైనల్స్ చేర్చి వీక్షకుల మనసులను గెల్చాడు.
Fifa World Cup : ఫిఫా ప్రపంచ కప్ 2022 సంచలనాలకు నాందిగా నిలుస్తుంది. ఎవరూ ఊహించని రీతిలో చిన్న జట్టులు అద్భుతమైన ఆట తీరుతో అదరగొడుతున్నారు. వీటిలో ముఖ్యంగా మొరాకో జట్టు అందరి దృష్టిని ఆకర్షిస్తుంది. గ్రూప్ దశ లోనే గత టోర్నీ రన్నరప్ అయిన క్రొయేషియా జట్టును