Home / extradition
వికీలీక్స్ వ్యవస్థాపకుడు జూలియన్ అసాంజే దశాబ్ద కాలం పాటు న్యాయ పోరాటం తర్వాత బుధవారం తన స్వదేశం ఆస్ట్రేలియాకు తిరిగి వచ్చాడు, గూఢచర్యం ఆరోపణలను ఎదుర్కొంటూ ఇన్నాళ్లూ బ్రిటన్‌లో తలదాచుకున్న ఆయనను విడిచిపెట్టాలని అమెరికా న్యాయస్థానం తీర్పిచ్చింది
లష్కరే తోయిబా (ఎల్ఈటీ) వ్యవస్థాపకుడు, 26/11 ముంబై దాడుల సూత్రధారి హఫీజ్ సయీద్‌ను అప్పగించాల్సిందిగా భారత ప్రభుత్వం పాకిస్థాన్‌ను అధికారికంగా అభ్యర్థించింది.సయీద్‌ను అప్పగించేందుకు చట్టపరమైన ప్రక్రియను ప్రారంభించాలని కోరుతూ విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ పాక్ ప్రభుత్వానికి అధికారిక అభ్యర్థనను పంపినట్లు వర్గాలు ధృవీకరించాయి.
పంజాబ్ నేషనల్ బ్యాంకు కుంభకోణం లో ప్రధాన నిందితుడు, వజ్రాల వ్యాపారి మెహుల్ ఛోక్సీకి ఆంటిగ్వా కోర్టులో ఊరట లభించింది. అతడిని దేశం నుంచి పంపించడానికి వీల్లేదంటూ ఛోక్సీకి అనుకూలంగా అక్కడి హైకోర్టు ఉత్తర్వులు వెలువరించినట్లు తెలుస్తోంది.
వజ్రాల వ్యాపారి నీరవ్ మోడీని భారత్‌కు అప్పగించాలని లండన్‌లోని హైకోర్టు బుధవారం ఆదేశించింది. లార్డ్ జస్టిస్ జెరెమీ స్టువర్ట్-స్మిత్ మరియు జస్టిస్ రాబర్ట్ జే ఈ తీర్పును వెలువరించారు.