Home / Ex Minister Narayana
అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు స్కామ్లో మాజీ మంత్రి, టీడీపీ నేత నారాయణకు సీఐడీ నోటీసులు అందించింది. అక్టోబర్ 4వ తేదీన తమ ఎదుట విచారణకు హాజరు కావాలంటూ సీఐడీ నోటీసుల్లో పేర్కొంది. ఈ స్కామ్లో నారాయణ ఏ2గా ఉన్న సంగతి తెలిసిందే. ఈ కేసులో ఆయన ఇదివరకే ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు.
తెదేపా మాజీ మంత్రి నారాయణపై ఆయన తమ్ముడి భార్య ప్రియ సంచలన ఆరోపణలు చేశారు. నారాయణ ఒక డేగలా తనపై కన్నేశారని ఆమె అన్నారు. ఓ పిట్టను డేగ ఎత్తుకెళ్లినట్టు తన పరిస్థితి మారిందని చెప్పారు. మోసపోయిన పిట్టను తానేనని వ్యాఖ్యానించారు. నారాయణ తనను చిత్రహింసలకు గురిచేసేవారని ఆరోపించారు.
తెలుగు దేశం పార్టీకి చెందిన ఇద్దర మాజీ మంత్రులకు సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. ఫోర్జరీ కేసులో సీనియర్ నేత అయ్యన్న పాత్రుడిని విచారణ చేపట్టేందుకు సర్వోన్నత న్యాయం స్థానం అనుమతి ఇవ్వగా.. పేపర్ లీకేజ్ కేసులో మాజీ మంత్రి నారాయణ పిటిషన్ కు కూడా సుప్రీం డిస్మిస్ చేసింది.
ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి నారాయణ కుమార్తె నివాసంలో సీఐడీ అధికారులు రెండో రోజు సోదాలు కొనసాగిస్తున్నారు. అమరావతి రాజధాని ప్రాంత భూవివాదానికి సంబంధించిన కేసుకు సంబంధించి ఏపీ సీఐడీ అధికారులు.. హైదరాబాద్లోని మాదాపూర్, గచ్చిబౌలి, కూకట్పల్లిలోని నారాయణ కుమార్తె నివాసాలపై శుక్రవవారం సోదాలు నిర్వహించారు.
మాజీ మంత్రి, టీడీపీ నేత నారాయణను విచారించేందుకు సీఐడీకి హైకోర్టు అనుమతిచ్చింది.
ఏపీ ప్రభుత్వం ప్రజా ప్రతినిధులపై కక్ష సాధింపును మాత్రం వదలడం లేదు. ప్రతిపక్ష పార్టీ నేతలను ఇబ్బందులు పెట్టేందుకు అధిక ప్రాధాన్యమిస్తుంది. తాజాగా మాజీ మంత్రి నారాయణను విదేశాలకు వెళ్లకుండా తలపెట్టిన లుకౌట్ నోటీసును కోర్టు పక్కన పెట్టింది
అమరావతి అసైన్డ్ భూముల కేసులో నారాయణకు హైకోర్టు మూడు నెలల ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. ఈ కేసులో నారాయణకు ముందస్తు బెయిల్ మంజూరు చేయాలని ఆయన తరఫు న్యాయవాది పోసాని వెంకటేశ్వర్లు హైకోర్టులో వాదనలు వినిపించారు.