Home / evacuation
గాజాపై ఇజ్రాయెల్ దాడులను మరింత ఉధృతం చేస్తోంది. తూర్పు రఫా ప్రాంతం నుంచి సుమారు లక్ష మంది పాలస్తీనియన్లు తాత్కాలికంగా ఖాళీ చేసి వెళ్లిపోవాలని ఆదేశించింది. హమాస్‌కు ఇది అత్యంత పటిష్టమైన ప్రాంతమని ఇజ్రాయెల్ వాదిస్తోంది.
ఇజ్రాయెల్ సైన్యం ఉత్తర గాజాలో కనీసం 1.1 మిలియన్ల మంది ప్రజలను ఖాళీ చేయమని ఆదేశించింది. గాజా నగర నివాసులను గాజా స్ట్రిప్ యొక్క దక్షిణ భాగంలోకి పారిపోవాలని ఆదేశించింది, హమాస్ మిలిటెంట్లు నగరం కింద సొరంగాలలో దాక్కున్నారని పేర్కొన్నారు. ఈ తరలింపు మీ భద్రత కోసమే నంటూ ఇజ్రాయెల్ సైన్యం తెలిపింది.
డోక్సురి తుపాను బుధవారం తీరాన్ని తాకడంతో ఉత్తర ఫిలిప్పీన్స్‌లో వేలాది మంది ప్రజలు నిరాశ్రయులయ్యారు.12,100 మంది ప్రజలు అధిక ప్రమాదం ఉన్న తీరప్రాంత గ్రామాల నుండి ఖాళీ చేయబడ్డారు మరియు డోక్సూరి సమీపిస్తున్నందున ముందుజాగ్రత్తగా పాఠశాలలు మరియు కార్యాలయాలు మూసివేయబడ్డాయి.
బిపర్ జోయ్ తుఫాను ఈరోజు గుజరాత్‌లోని జాఖౌ నౌకాశ్రయానికి సమీపంలో సౌరాష్ట్ర మరియు కచ్ ను ఆనుకుని ఉన్న పాకిస్తాన్ తీరాలను దాటుతుందని భారత వాతావరణ శాఖ తెలిపింది. ఈరోజు సాయంత్రం 4-5 గంటలకు బిపర్ జోయ్ తుఫాను తీరం దాటనుంది.
బిపర్ జోయ్ తుఫాను దృష్ట్యా గుజరాత్‌లోని సౌరాష్ట్ర మరియు కచ్ తీరాలకు భారత వాతావరణ శాఖ ( ఐఎండి) మంగళవారం ఆరెంజ్ అలర్ట్ ప్రకటించింది. జూన్ 15 సాయంత్రానికి బిపర్ జోయ్ తుఫాను జఖౌ పోర్ట్ ప్రాంతాన్ని దాటే అవకాశం ఉంది.
హైతీలో వారాంతంలో కురిసిన భారీ వర్షాల కారణంగావిస్తృతంగా వరదలు పోటెత్తడం, కొండచరియలు విరిగిపడటంతో 15 మంది మరణించారు. ఎనిమిది మంది తప్పిపోయారు. పలుచోట్ల లోతట్టు ప్రాంతాలు మునిగిపోవడంతో పలువురు నిరాశ్రయులయ్యారు.
ఆపరేషన్ కావేరి కింద న్యూఢిల్లీలో అడుగుపెట్టిన భారతీయులు, భారత సైన్యం యొక్క ప్రయత్నాలను మరియు ప్రభుత్వ ఏర్పాట్లను ప్రశంసించారు.ఢిల్లీ విమానాశ్రయం వెలుపల నిర్వాసితులైన వారు దేశాన్ని, సైన్యాన్ని, ప్రధాని నరేంద్ర మోదీని కీర్తిస్తూ నినాదాలు చేశారు.
సూడాన్‌లో కొనసాగుతున్న ఘర్షణల్లో 400 మందికి పైగా మరణించగా 3,351 మంది గాయపడ్డారని ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) తెలిపింది. దేశ సైన్యం మరియు పారామిలిటరీ ర్యాపిడ్ సపోర్ట్ ఫోర్సెస్ (RSF) మధ్య జరుగుతున్న ఘర్షణల్లో భాగంగా ఇతర దేశాలకు చెందిన పలువురు చిక్కుకు పోయారు. వీరిని అక్కడనుంచి తరలించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి.