Last Updated:

Israeli Army: గాజాలోని రఫా నుండి లక్ష మంది పాలస్తీనియన్లను తరలిస్లున్న ఇజ్రాయెల్ సైన్యం

గాజాపై ఇజ్రాయెల్‌ దాడులను మరింత ఉధృతం చేస్తోంది. తూర్పు రఫా ప్రాంతం నుంచి సుమారు లక్ష మంది పాలస్తీనియన్లు తాత్కాలికంగా ఖాళీ చేసి వెళ్లిపోవాలని ఆదేశించింది. హమాస్‌కు ఇది అత్యంత పటిష్టమైన ప్రాంతమని ఇజ్రాయెల్‌ వాదిస్తోంది.

Israeli Army: గాజాలోని రఫా నుండి  లక్ష మంది పాలస్తీనియన్లను తరలిస్లున్న ఇజ్రాయెల్ సైన్యం

Israeli Army: గాజాపై ఇజ్రాయెల్‌ దాడులను మరింత ఉధృతం చేస్తోంది. తూర్పు రఫా ప్రాంతం నుంచి సుమారు లక్ష మంది పాలస్తీనియన్లు తాత్కాలికంగా ఖాళీ చేసి వెళ్లిపోవాలని ఆదేశించింది. హమాస్‌కు ఇది అత్యంత పటిష్టమైన ప్రాంతమని ఇజ్రాయెల్‌ వాదిస్తోంది. తాజాగా ఇజ్రాయెల్‌ కఠిన చర్యలు తీసుకోవడానికి ప్రధాన కారణం .. తూర్పు రఫా నుంచి హమాస్‌ మిలిటెంట్లు రాకెట్లతో ఇజ్రాయెల్‌పై దాడులు చేయడంతో ముగ్గురు ఇజ్రాయెల్‌ సైనికులు మృతి చెందారు. దీంతో ఇజ్రాయెల్‌ తూర్పు రఫా ప్రాంతంలో పరిమిత స్థాయిలో ఆపరేషన్‌ చేయాలని నిర్ణయించింది. అయితే పరిమిత స్థాయి ఆపరేషన్‌ అంటూ భారీ స్థాయిలో ఇజ్రాయెల్‌ విరుచుకుపడే అవకాశం కూడా ఉంటుందని ఇజ్రాయెల్‌ ఆర్మీ అధికారి ప్రతినిధి విదేశీ మీడియాకు చెప్పారు.

హమాస్ ను నేలమట్టం చేస్తాం..(Israeli Army)

ఇజ్రాయెల్‌కు చెందిన ముగ్గురు సైనికులు మృతి చెందడంతో తూర్పు రఫాపై సైనిక చర్యకు శ్రీకారం చుట్టాలని నిర్ణయించింది ఇజ్రాయెల్‌ మిలిటరీ, ముందుగా సుమారు లక్ష మంది పౌరులను ఆ ప్రాంతం నుంచి ఖాళీ చేయించి హ్యుమానిటేరియన్‌ జోన్‌ మువాసీ ప్రాంతానికి తరలి వెళ్లాలని సూచించింది. కాగా ఇజ్రాయెల్‌ మిలిటరీ అధికార ప్రతినిధి లెఫ్టినెంట్‌ కల్నల్‌ నాడావ్‌ సోషాని మాట్లాడుతూ.. ఇక హమాస్‌ను పూర్తిగా నేలమట్టం చేస్తామని శపథం చేశారు. ఇజ్రాయెల్‌ మిలిటరీ టెక్స్ట్‌ మేసేజ్‌లు, ఫ్లయర్స్‌ను సోషల్‌ మీడియాలో వదులుతోంది. యుద్ధానికి సిద్దం అవుతున్న ఇజ్రాయెల్‌ రఫా ప్రాంతంలో ఫీల్డ్‌ హాస్పిటల్స్‌, టెంట్స్‌, ఆహారం, నీరు భద్రపరుస్తోంది. తూర్పు రఫాపై దాడులు చేయడానికి మరో కారణం ఇజ్రాయెల్‌పై దాడి చేసి బందీలుగా తీసుకువెళ్లిన వారిని విడిచిపెట్టడానికి హమాస్‌ నిరాకరించడంతో దాడులు తీవ్రతరం చేయాలని ఇజ్రాయెల్‌ నిర్ణయించింది. ప్రస్తుతం రఫా ప్రాంతంలో సుమారుగా 12 లక్షల మంది నిర్వాసితులు తాత్కాలిక షెల్టర్లలో తలదాచుకుంటున్నారని ఐక్యరాజ్య సమితి తెలిపింది.