Home / ED Summons
తిరుచిరాపల్లికి చెందిన ప్రణవ్ జ్యువెలరీ గ్రూప్ కు సంబంధించిన మనీలాండరింగ్ కేసులో నటుడు ప్రకాష్ రాజ్‌కు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) నోటీసులు జారీ చేసింది. బీజేపీని తీవ్రంగా విమర్శించే ప్రకాష్ రాజ్ (58) ఈ కంపెనీకి బ్రాండ్ అంబాసిడర్‌గా ఉన్నారు. వచ్చేవారం చెన్నైలో ఈడీ ఎదుట హాజరుకావాలని కోరారు.
రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ కుమారుడు వైభవ్ గెహ్లాట్‌కు ఫెమా (ఫారిన్ ఎక్స్ఛేంజ్ మేనేజ్మెంట్ యాక్ట్) కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ)సమన్లు జారీ చేసింది. దీనిని రాజకీయ కుట్ర మరియు ప్రభుత్వ సంస్థల దుర్వినియోగంగా వైభవ్ గెహ్లాట్ పేర్కొన్నారు.
: ఆన్లైన్ బెట్టింగ్ కేసుకు సంబంధించి బాలీవుడ్ నటుడు రణబీర్ కపూర్‌కు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అక్టోబర్ 6న సమన్లు జారీ చేసింది.ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ మూలాల ప్రకారం, రణబీర్ కపూర్ సబ్సిడరీ యాప్‌ను ప్రమోట్ చేసారు.
తెలంగాణ రాజకీయాలకు దేశ రాజధాని ఢిల్లీ మరోసారి వేదికైంది. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ, కేసీఆర్ కుమార్తె కవిత మరోసారి ఈడీ సమన్లు జారీ చేసింది. రేపు విచారణకు హాజరుకావాలని ఆదేశాలిచ్చింది. దీంతో కవిత ఈడీ విచారణ కీలకంగా మారింది.
జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సొరేన్ బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వానికి సవాల్ విసిరారు. నేరం చేసి ఉంటే తనను అరెస్ట్ చేయాలన్నారు. అంతేకానీ తనను ప్రశ్నించేలా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ను ప్రోత్సహించవద్దని అన్నారు