Home / DRDO
రక్షణ పరిశోధన మరియు అభివృద్ధి సంస్థ(డీఆర్‌డీవో) లో ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదలైంది. 181 సైంటిస్ట్ (b) ఉద్యోగాలను భర్తీ చేసేందుకు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు ఆహ్వానిస్తోంది డీఆర్‌డీవో. సైన్సులో ఇంజినీరింగ్, పోస్టు గ్రాడ్యుయేషన్ చేసిన అభ్యర్థులను ఈ పోస్టులకు అర్హులుగా డీఆర్‌డీవో పేర్కొంది.
దేశాన్ని రక్షించుకోవడం అనేది కత్తి మీద సాము లాంటిది. ఇందుకోసం లక్షలాది మంది సైనికులు నిరంతరం పహారా కాస్తుండడం ఒక వంతైతే, దేశ రక్షణకు సంబంధించిన సాంకేతిక, ఆయుధాలు, వాహనాలు, రాకెట్లు, మిస్సైల్స్ వంటి తయారీ కూడా ఎంతో కీలకం.
డిపార్ట్‌మెంట్ ఆఫ్ డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ సెక్రటరీగా మరియు డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ ఆర్గనైజేషన్ (డిఆర్‌డిఓ) చైర్మన్‌గా సమీర్ వి కామత్‌ను నియమించారు. డిఆర్‌డిఓలో నావల్ సిస్టమ్స్ & మెటీరియల్స్ డైరెక్టర్ జనరల్‌గా ఉన్న కామత్, జి సతీష్ రెడ్డి స్థానంలో నియమితులయ్యారు.
రిక్రూట్‌మెంట్ అండ్ అసెస్‌మెంట్ సెంటర్ (RAC), డీఆర్‌డీవో రిక్రూట్‌మెంట్ నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. డీఆర్‌డీవోసహా వివిధ విభాగాలలో సైంటిస్ట్ 'బి' పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి అభ్యర్థుల నుండి దరఖాస్తులను ఆహ్వానిస్తుంది. ఆసక్తి గల అభ్యర్థులు RAC అధికారిక వెబ్‌సైట్ rac.gov.in ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు.