Home / donation
ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకుడు నందన్ నీలేకని తన విద్యా సంస్థ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (IIT)బాంబే కి 50 ఏళ్లు పూర్తయిన సందర్భంగా రూ.315 కోట్లను విరాళంగా ఇచ్చారు. నీలేకని 1973లో ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్‌లో బ్యాచిలర్ డిగ్రీ కోసం ఇన్స్టిట్యూట్లో చేరారు.
200 కోట్ల మనీలాండరింగ్ కేసులో ఢిల్లీలోని మండోలి జైలులో ఉన్న నిందితుడు సుకేష్ చంద్రశేఖర్ ఒడిశా రైలు ప్రమాదానికి రూ.10 కోట్లు ఆఫర్ చేశాడు. రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్‌కు రాసిన లేఖలో చంద్రశేఖర్ విరాళం ఇవ్వడానికి అనుమతిని కోరాడు, ఆ మొత్తాన్ని తన సక్రమమైన మరియు పన్ను విధించిన ఆదాయం అని పేర్కొన్నాడు.
Package Star Jagan: ఆంధ్రప్రదేశ్ లోని అనకాపల్లి పరవాడ లోని జేఎన్ ఫార్మాసిటీలో డిసెంబర్ 26న అగ్ని ప్రమాదం చోటు చేసుకున్న విషయం విదితమే. ఫార్మాసిటీలోని లారస్ ల్యాబ్స్(Laurus labs) యూనిట్ 3లో జరిగిన ఈ అగ్నిప్రమాదంలో నలుగురు సజీవ దహనం కాగా, మరొకరు 80 శాతం కాలిన గాయాలతో హాస్పిటల్ లో చికిత్స తీసుకుంటున్నారు. ఈ ఘటనకు సంబందించి లారస్ ల్యాబ్స్ పై స్థానిక పోలీసులు కేసు నమోదు చేశారు. కంపెనీ నిర్వహణలో నిర్లక్ష్యం తో […]
అన్నం పరబ్రహ్మ స్వరూపం మాటలకు తెలుగుదేశం శ్రేణులు కట్టుబడ్డారు. ఏపీ ప్రభుత్వం అన్న క్యాంటిన్ నిర్వహణపై చేతులెత్తేయడంతో తెదేపా కార్యకర్తలే పేదలకు, ప్రజలకు అన్నం అందించేందుకు ఉత్సాహంగా ముందుకొస్తున్నారు. మైలవరం, రెడ్డి గుంటకు చెందిన చేబ్రోలు నాగేశ్వరరావు సోదరులు తమ పొలంలో పండిన ధాన్యంను అన్న క్యాంటిన్ నిర్వహణకు ఇచ్చేందుకు సిద్దమైనారు
రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేష్ అంబానీ కుటుంబ సమేతంగా శుక్రవారం ఉదయం తిరుమల శ్రీవారి అభిషేకం, నిజపాద దర్శన సేవలో పాల్గొన్నారు. తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ధర్మారెడ్డి అంబానీని సాదరంగా స్వాగతించి, స్వామివారి దర్శనానికి అన్నీ ఏర్పాట్లు చేసారు.