Last Updated:

Sukesh Chandrasekhar: ఒడిశా రైలు ప్రమాద బాధితుల కోసం రూ. 10 కోట్ల విరాళం ప్రకటించిన సుకేష్ చంద్రశేఖర్

200 కోట్ల మనీలాండరింగ్ కేసులో ఢిల్లీలోని మండోలి జైలులో ఉన్న నిందితుడు సుకేష్ చంద్రశేఖర్ ఒడిశా రైలు ప్రమాదానికి రూ.10 కోట్లు ఆఫర్ చేశాడు. రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్‌కు రాసిన లేఖలో చంద్రశేఖర్ విరాళం ఇవ్వడానికి అనుమతిని కోరాడు, ఆ మొత్తాన్ని తన సక్రమమైన మరియు పన్ను విధించిన ఆదాయం అని పేర్కొన్నాడు.

Sukesh Chandrasekhar: ఒడిశా రైలు ప్రమాద బాధితుల కోసం   రూ. 10 కోట్ల విరాళం ప్రకటించిన సుకేష్ చంద్రశేఖర్

 Sukesh Chandrasekhar: 200 కోట్ల మనీలాండరింగ్ కేసులో ఢిల్లీలోని మండోలి జైలులో ఉన్న నిందితుడు సుకేష్ చంద్రశేఖర్ ఒడిశా రైలు ప్రమాదానికి రూ.10 కోట్లు ఆఫర్ చేశాడు. రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్‌కు రాసిన లేఖలో చంద్రశేఖర్ విరాళం ఇవ్వడానికి అనుమతిని కోరాడు, ఆ మొత్తాన్ని తన సక్రమమైన మరియు పన్ను విధించిన ఆదాయం అని పేర్కొన్నాడు.

బాధితుల పిల్లల చదువులకోసం..( Sukesh Chandrasekhar)

కంట్రిబ్యూషన్ నా వ్యక్తిగత ఫండ్స్ నుండి వచ్చినది, ఇది పూర్తిగా పన్ను విధించబడింది మరియు రిటర్న్‌ల ఫైలింగ్‌లతో పాటు రూ. పది కోట్ల (రూ. 10,00,00,000) డిమాండ్ డ్రాఫ్ట్‌ అందిస్తానంటూ లేఖలో పేర్కొన్నాడు. నేను, ఒక బాధ్యతాయుతమైన మరియు మంచి పౌరుడిగా, ఈ 10 కోట్ల రూపాయల నిధిని ప్రత్యేకంగా రైలు ప్రమాదంలో తమ ప్రియమైన వారిని కోల్పోయిన కుటుంబాల్లో పిల్లల చదువుకు ఉపయోగించాలనుకుంటున్నాను. పాఠశాల, ఉన్నత పాఠశాల, కళాశాల విద్య ఏదయినా సరే వాటికికి ప్రత్యేకంగా ఉపయోగపడాలని తెలిపాడు.

శిక్ష అనుభవిస్తున్న ఖైదీలకోసం..

సుకేష్ చంద్రశేఖర్ మార్చి 25న తన పుట్టినరోజు సందర్భంగా  శిక్ష అనుభవిస్తున్న  కోసం రూ. 5 కోట్ల విరాళాన్ని అందజేయడానికి కోరుతూ డిజి ప్రిజన్స్‌కు లేఖ రాశాడు.
వారి బెయిల్ బాండ్‌ల కోసం చెల్లించలేని జైలు ఖైదీల సంక్షేమం కోసం రూ. 5,11,00,000 విరాళంగా ఇవ్వడానికి ఆ లేఖ ద్వారా అధికారి అనుమతిని కోరాడు.అండర్ ట్రయల్‌గా అనేక సంవత్సరాలు జైలులో ఉన్న ఖైదీలు మరియు వారి కుటుంబాలు, ప్రధానంగా పిల్లలు, వారి చదువుకు మరియు వారి ఇంటి నిర్వహణకు డబ్బు చెల్లించలేని స్థితిలో ఉన్నారు, ఎందుకంటే ఇంటియజమాని జైలులో ఉన్నారు. అందువలన ఈ మొత్తాన్ని వారి సంక్షేమం కోసం అందించడానికి అనుమతించాలని సుకేష్ కోరాడు.

రెలిగేర్ ఎంటర్‌ప్రైజెస్ మాజీ ప్రమోటర్ భార్య జప్నా సింగ్ మరియు అదితి సింగ్‌లను మోసం చేసి డబ్బు వసూలు చేసినందుకు చంద్రశేఖర్‌పై ఢిల్లీ పోలీస్ ఎకనామిక్ అఫెన్సెస్ వింగ్ (EOW) గత ఏడాది ఎఫ్‌ఐఆర్ నమోదు చేసింది.చంద్రశేఖర్ మరియు అతని భార్య లీనా మరియా పాల్‌ను గత ఏడాది సెప్టెంబర్‌లో ఢిల్లీ పోలీసులు అరెస్టు చేశారు.