Home / Dhamki movie
టాలీవుడ్ యంగ్ హీరో విశ్వక్ సేన్ హీరోగా 'ధమ్కీ' సినిమా రూపొందుతోంది. అయితే తాజాగా కొంతసేపటి క్రితం ఈ సినిమా రిలీజ్ డేట్ ను ప్రకటించారు చిత్ర యూనిట్. తెలుగు, తమిళ, మలయాళ, హిందీ భాషల్లో ఈ సినిమాను ఫిబ్రవరి 17వ తేదీన విడుదల చేయనున్నట్టుగా చెబుతూ అధికారిక పోస్టర్ ను విడుదల చేశారు.
ఓరి దేవుడా మూవీతో సక్సెస్ అందుకున్న విశ్వక్ సేన్ ప్రస్తుతం నటిస్తూ స్వయంగా దర్శకత్వం వహిస్తున్న సినిమా ధమ్కీ. ఇందులో నివేతా పేతురాజ్ హీరోయిన్. ఈ సినిమా పాన్ ఇండియన్ రేంజ్ లో తెలుగు, తమిళ, హిందీ, మలయాళ భాషల్లో విడుదల చేస్తున్నట్టు ప్రకటించారు.
ఓరి దేవుడా అనే హిట్ మూవీ తర్వాత, ఇప్పుడు విశ్వక్ సేన్ సినీ ప్రేమికులను అలరించేందుకు యాక్షన్ ఎంటర్‌టైనర్ ధమ్కీతో వస్తున్నాడు. గురువారం ధమ్కీ మేకర్స్ విశ్వక్ సేన్ ఫస్ట్ లుక్ పోస్టర్‌ను రిలీజ్ చేసారు.