Home / Delhi
దేశవ్యాప్తంగా నవరాత్రుల ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. భారతదేశంలోని అమెరికా రాయబారి ఎరిక్ గార్సెట్టి ఢిల్లీలోని చిత్తరంజన్ పార్క్ (సిఆర్ పార్క్)లో ఉన్న దుర్గాపూజ మండపాన్ని సందర్శించారు. అక్కడ నిర్వాహకులు ఆయనకు బెంగాలీ సంప్రదాయంలో స్వాగతం పలికారు. మండపంలో నిర్వహించిన పూజ వేడుకల్లో ఆయన ఉత్సాహంగా పాల్గొన్నారు.
దేశరాజధాని ఢిల్లీలో మరోసారి భూప్రకంపనలు సంభవించాయి. ఢిల్లీ-ఎన్‌సిఆర్ ప్రాంతంలో ఆదివారం 3.1 తీవ్రతతో భూకంపం సంభవించింది. దీనితో ప్రజలు ఆందోళన చెందారు. ప్రజలు భయంతో పరుగెడుతున్న వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.
ఇజ్రాయెల్‌లో చిక్కుకుపోయిన భారతీయ పౌరులను తిరిగి స్వదేశానికి తీసుకురావడానికి మొదటి చార్టర్ విమానం గురువారం రాత్రి టెల్ అవివ్ లోని బెన్ గురియన్ విమానాశ్రయం నుంచి బయలుదేరి శుక్రవారం ఉదయం ఢిల్లీ విమానాశ్రయంలో దిగింది.
దేశ రాజధాని ఢిల్లీలో భూకంపం సంభవించింది. ఢిల్లీతోపాటు ఉత్తర భారతదేశంలోని పలు ప్రాంతాల్లో మంగళవారం భూప్రకంపనలు వచ్చాయి. ఢిల్లీ-ఎన్సీఆర్, పంజాబ్, హర్యానా సహా ఉత్తర భారతదేశంలోని పలు ప్రాంతాల్లో మధ్యాహ్నం 2 గంటల 25 నిమిషాల సమయంలో భూమి కంపించింది.
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ గురువారం ఢిల్లీలోని కీర్తినగర్‌లోని ఫర్నిచర్ మార్కెట్‌ను సందర్శించి కార్పెంటర్లు, కార్మికులతో ముచ్చటించారు. దీనికి సంబంఢించి కాంగ్రెస్ పంచుకున్న వీడియోలు మరియు చిత్రాలు రాహుల్ గాంధీ హస్తకళాకారులతో కలిసి పనిచేస్తున్నట్లు చూపిస్తున్నాయి.
ఢిల్లీలో సెప్టెంబరు 8-10 తేదీల్లో జరిగే G20 నేతల సదస్సు సందర్భంగా ఢిల్లీ పోలీసులు విస్తృత భద్రతా ఏర్పాట్లు మరియు ట్రాఫిక్ ఆంక్షలను అమలు చేస్తున్నందున ఆన్లైన్ ఫుడ్ డెలివరీ సేవలు ఢిల్లీలో అందుబాటులో ఉండవు.
తనపై లైంగిక వేధింపులకు పాల్పడిన ట్యూటర్‌ను చంపినందుకు 14 ఏళ్ల బాలుడిని ఢిల్లీ పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు. ట్యూటర్ బాలుడిని నిత్యం దుర్భాషలాడేవాడని వాటిని వీడియో కూడా తీశాడని పోలీసులు తెలిపారు.పేపర్ కట్టర్ తో హత్య చేసిన మూడు రోజుల తర్వాత బాలుడిని శుక్రవారం అదుపులోకి తీసుకున్నారు.
వచ్చే నెలలో జరగనున్న జీ20 సమ్మిట్‌కు దేశ రాజధాని న్యూఢిల్లీ వేదికగా సిద్ధమవుతున్న తరుణంలో లగ్జరీ కార్లకు భారీ డిమాండ్ ఏర్పడింది. సెప్టెంబర్ 9, 10 తేదీల్లో రెండు రోజుల అంతర్జాతీయ సదస్సు జరగనుంది. సన్నాహాల్లో భాగంగా జీ20 ప్రతినిధుల కోసం 30కి పైగా విలాసవంతమైన హోటళ్లను బుక్ చేశారు.
ట్రాఫిక్ ఉల్లంఘనలకు పాల్పడిన వారికి జారీ చేసే చలానాలు ఢిల్లీ ట్రాఫిక్ పోలీసులకు తలనొప్పిగా మారాయి. ఎందుకంటే ఢిల్లీ లోని 20,000 వాహనాలు ఒక్కొక్కటి 100కి పైగా చలాన్లను అందుకున్నాయి. అయితే వాటి యజమానులు ఇంకా జరిమానాలు చెల్లించడానికి పట్టించుకోలేదు.
మూడు రోజులుగా ఢిల్లీలో ఉన్న జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ నేటి ఉదయం ఆంధ్రప్రదేశ్ బీజేపీ వ్యవహారాల ఇన్చార్జ్ మురళీధరన్‌తో భేటీ అయ్యారు. ఈ అల్పాహార సమావేశంలో పవన్‌తోపాటు నాదెండ్ల మనోహర్ కూడా పాల్గొన్నారు. 15 నిమిషాల పాటు ఏపీ రాజకీయ వ్యవహారాలపై చర్చించారు.