Home / Delhi court
మహిళా రెజ్లర్లపై లైంగిక వేధింపులకు పాల్పడిన కేసులో డబ్ల్యూఎఫ్ఐ మాజీ చీఫ్ బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్కు ఢిల్లీ కోర్టు మంగళవారం 2 రోజుల మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్ రెగ్యులర్ బెయిల్ పిటిషన్పై కోర్టు గురువారం వాదనలు విననుంది.
దేశంలోని అగ్రశ్రేణి మహిళా రెజ్లర్లు చేసిన లైంగిక వేధింపుల ఆరోపణలకు సంబంధించి బీజేపీ ఎంపి, రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (డబ్ల్యుఎఫ్ఐ) మాజీ చీఫ్ బ్రిజ్ భూషణ్ సింగ్ కు ఢిల్లీలోని కోర్టు సమన్లు జారీ చేసింది. దాదాపు ఆరుగురు మహిళా రెజ్లర్లు బ్రిజ్ భూషణ్ సింగ్ తమను లైంగికంగా వేధిస్తున్నారని, బెదిరిస్తున్నారని ఆరోపించారు.
రూ.200 కోట్ల మనీలాండరింగ్ కేసులో తన పేరును అన్యాయంగా లాగడం ద్వారా జాక్వెలిన్ ఫెర్నాండెజ్ తన పరువు తీశారంటూ నటి నోరా ఫతేహి దాఖలు చేసిన క్రిమినల్ ఫిర్యాదును ఢిల్లీ కోర్టు మార్చి 25న విచారించే అవకాశం ఉంది.
ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో నిందితుడిగా ఉన్న వ్యాపారి దినేష్ అరోరా ఈ కేసులో ప్రభుత్వ సాక్షిగా మారతారని సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ) ఈరోజు సిటీ కోర్టుకు తెలిపింది.
మనీలాండరింగ్ కేసులో మే నెలలో అరెస్టయిన ఢిల్లీ మంత్రి సత్యేందర్ జైన్ జైలులో విలాసవంతమైన జీవితాన్ని గడుపుతున్నారని ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ ఆదివారం ప్రత్యేక కోర్టుకు తెలిపింది.
ఢిల్లీకి వెల్లతారు. అక్కడే నివాసం ఉండాలంటారు. అది కూడా అప్పనంగా ప్రభుత్వం నివాసమే కావాలంటారు. ఇది నేటి ప్రజా ప్రతినిధుల తీరు. అలాంటి వారికి ఢిల్లీ కోర్టు ఒప్పుకొనేది లేదంటూ ఓ మాజీ ప్రజాప్రతినిధికి ఖాళీ చేయాల్సిందేనని ఆదేశాలు జారీ చేసింది.