Home / dasara celebrations
దుర్గా పూజ ఉత్సవం ముగింపు వేడుకల్లో అపశ్రుతి చోటుచేసుకుంది. దుర్గా మాత విగ్రహాల నిమజ్జనం సందర్భంగా దేశ వ్యాప్తంగా దాదాపు 15 మంది మరణించారు. పశ్చిమబెంగాల్, ఉత్తరప్రదేశ్, రాజస్థాన్ రాష్ట్రాల్లో జరిగిన దుర్గా మాత ప్రతిమల నిమజ్జన ఉత్సవాల్లో జరిగిన ప్రమాదాల వల్ల పలువురు మరణించారు.
దసరా వేడుకలను దేశవ్యాప్తంగా వైభవంగా నిర్వహిస్తుంటారు. జగన్మాతను వివిధ రూపాల్లో తొమ్మిది రోజుల పాటు వైభవంగా పూజలు నిర్వహిస్తుంటారు. మరి దసరా పండుగ అంటుంటాం కానీ అసలు ఈ పండుగకు దసరా అనే పేరు ఎందుకు వచ్చింది. మరి దరసరా పండుగ వెనుక ఉన్న అంతరార్థం ఏంటి? దాని ప్రత్యేకలేంటో ఈ కథనం ద్వారా తెలుసుకుందాం.
ఏదైనా దేవాలయానికి వెళ్లినప్పుడు చెప్పులు బయటే విడిచి వెళతాం. అలా చెప్పులువేసుకుని దేవాలయానికి వెల్లడం అపచారంగా హిందువులు భావిస్తుంటారు. కానీ అందుకు భిన్నంగా అక్కడి గుడిలోని అమ్మవారికి చెప్పులనే మొక్కులుగా సమర్పించుకుంటారు. మరి ఆ గుడి ఎక్కడుంది? ఎందుకు అలా చెప్పులను అమ్మవారికి సమర్పిస్తారో ఈ కథనం చదివెయ్యండి.
దేవీనవరాత్రుల్లో భాగంగా సంప్రదాయబద్ధంగా నృత్యం చేస్తూ ఆ ప్రాంతవాసులు జగన్మాతను ఆరాధిస్తున్నారు. కానీ అకస్మాత్తుగా ఓ యువకుడు డాన్స్ చేస్తూ గుండెపోటుతో అక్కడే కుప్పకూలిపోయాడు. దీనితో శరన్నవరాత్రి ఉత్సవాల్లో విషాదం నెలకొంది. ఈ ఘటన గుజరాత్ లో చోటుచేసుకుంది.
తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలను ప్రతిబింబించే పండుగగా దసరాను జరుపుకుంటుంటారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి విడిపోయి తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడ్డాక ఇక్కడి పండుగలకు ప్రాధాన్యం పెరిగింది. బతుకమ్మ సంస్కృతి విదేశాలకు కూడా విస్తరించింది. దసరాను ఘనంగా జరుపుకోవడమూ పెరిగింది. కానీ దసరా రోజున జమ్మిచెట్టుకు పూజ చేయడం, పాలపిట్టను దర్శించుకోవడమనే సంప్రదాయం మాత్రం క్రమంగా కనుమరుగవుతుంది.
విద్యాబుద్ధులు నేర్పే తల్లి జ్ఞాన సరస్వతి దేవి జన్మనక్షత్రం అయిన మూలా నక్షత్రం రోజు అమ్మవారికి ఎంతో వైభవంగా పూజలు నిర్వహిస్తారు అర్చకస్వాములు. చిన్నారులకు ఈ రోజు అక్షరాభ్యాసం చేయిస్తే ఉన్నత విద్యావంతులు అవుతారని ప్రజల నమ్మకం. అలాంటి రోజైన ఈ రోజున తెలుగురాష్ట్రాల్లోని ప్రసిద్ధ సరస్వతి దేవి క్షేత్రమైన బాసరలోని సరస్వతి దేవి ఆలయంలో శరన్నవరాత్రి వేడుకలు వైభవంగా జరుగుతున్నాయి.
విశాఖపట్నం వన్ టౌన్ లోని 145ఏళ్ల చరిత్ర గల కన్యకాపరమేశ్వరి దేవి ఆలయంలో దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. కాగా నేడు అమ్మవారి శ్రీ మహాలక్ష్మి దేవి అలంకరణలో భాగంగా గర్భాలయాన్ని అంతా బంగారం, నోట్ల కట్టల నింపేశారు. ఆలయం అంతా పసిడి కాంతులతో నోట్ల దగదగలతో మెరిగిసిపోతుంది.
ఏపీలో అధికార పార్టీ నేతల తీరుతో ఆలయాలు కూడా అపవిత్రంగా మారిపోతున్నాయి. భగవంతుని దర్శనాన్ని సైతం భక్తితో కాకుండా అహంభావం మాటున దర్శించుకొంటూ వైకాపా ఎమ్మెల్యే వెల్లంపల్లి వార్తల్లోకి ఎక్కారు.
ఆంధ్రప్రదేశ్ విజయవాడలోని ఇంద్రకీలాద్రి పై ఈనెల 26 నుంచి దసరా ఉత్సవాలను ప్రారంభించనున్నట్లు ఈవో భ్రమరాంబ తెలిపారు. పది రోజులపాటు జరిగే ఉత్సవాలలో వివిధ అలంకారాల్లో అమ్మవారు భక్తులకు దర్శనమివ్వనున్నారు.
తమిళనాడు దేవాలయాల్లో అశ్లీలత డాన్సులు, సినిమా పాటలకు మద్రాసు హైకోర్టు చెక్ పెట్టింది. ఆలయాల్లో అశ్లీలతకు చోటులేకుండా భక్తి గీతాలే ఉండాలంటూ ఉత్తర్వులు జారీ చేసింది. ఓ సామాజిక కార్యకర్త హైకోర్టును ఆశ్రయించడంతో ఈ మేరకు నిషేదం విధిస్తున్నట్లు న్యాయస్థానం పేర్కొనింది