Last Updated:

Vizag: ఆ ఆలయమంతా డబ్బు, బంగారమే..!

విశాఖపట్నం వన్ టౌన్ లోని 145ఏళ్ల చరిత్ర గల కన్యకాపరమేశ్వరి దేవి ఆలయంలో దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. కాగా నేడు అమ్మవారి శ్రీ మహాలక్ష్మి దేవి అలంకరణలో భాగంగా గర్భాలయాన్ని అంతా బంగారం, నోట్ల కట్టల నింపేశారు. ఆలయం అంతా పసిడి కాంతులతో నోట్ల దగదగలతో మెరిగిసిపోతుంది.

Vizag: ఆ ఆలయమంతా డబ్బు, బంగారమే..!

Vizag: విశాఖపట్నం వన్ టౌన్ లోని 145ఏళ్ల చరిత్ర గల కన్యకాపరమేశ్వరి దేవి ఆలయంలో దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. కాగా నేడు అమ్మవారి శ్రీ మహాలక్ష్మి దేవి అలంకరణలో భాగంగా గర్భాలయాన్ని అంతా బంగారం, నోట్ల కట్టలతో నింపేశారు. ఆలయం అంతా పసిడి కాంతులతో నోట్ల దగదగలతో మెరిగిసిపోతుంది.

సాగరతీరమైన విశాఖ వన్ టౌన్ లో పూర్ణ మార్కెట్ ఏరియాలోని శ్రీ కన్యకాపరమేశ్వరి దేవి ఆలయం రోడ్డును ఆనుకునే ఉంటుంది. ఈ ఆలయం కన్నె పూజలకు ప్రసిద్ధి. పెళ్లికాని అమ్మాయిలు ఈ అమ్మవారిని పూజిస్తే పెళ్లి జరుగుతుందని ఇక్కడి భక్తుల నమ్మకం. అలాగే దసరా ఉత్సవాల్లో భాగంగా మహాలక్ష్మీ అలంకరణ రోజు అమ్మవారి పాదాల ముందు డబ్బును ఉంచితే ఏడాదంతా వారికి ధనలాభం కలుగుతుందని స్థానికులు బలంగా నమ్ముతారు. కాగా నేడు మహాలక్ష్మీ అలంకరణలో భాగంగా అమ్మవారి గర్బాలయాన్ని అంతా నోట్ల కట్టలు, బంగారం, వెండి వస్తువులతో నింపేశారు. ఇలా ఈ రోజు అలంకరించే డబ్బు అంతా భక్తులదేనని, పండుగ రోజులలో అమ్మవారి ముందు డబ్బు, బంగారం ఉంచిన తరువాత వాటిని భక్తలు ఇళ్లకు తీసుకెళ్తారని ఆలయ ప్రధాన అర్చకులు తెలిపారు. గత ఏడాది దసరా ఉత్సవాలప్పుడు కోటిన్నర డబ్బు అమ్మవారి ముందు ఉంచామని కానీ ఈ ఏడాది భక్తులు ఏకంగా మూడున్నర కోట్ల డబ్బు, 6 కేజీల బంగారం, వెండితో అమ్మవారిని అలంకరించారని ఆయన వెల్లడించారు.

స్మార్ట్ సిటీ అయిన వైజాగ్ లోని ఓ చిన్న ఆలయంలో ఇలా భక్తులే కోట్ల కొద్దీ డబ్బు, కేజీల కోద్దీ బంగారం, వెండిలతో అమ్మవారిని అలంకరించడం ప్రస్తుతం టాక్ ఆఫ్ ది టౌన్ గా మారింది. ఇదిలా ఉండగా ఇంత బంగారం, వెండి, నగదుతో అమ్మవారిని అలంకరించినా ఎటువంటి దొంగతనం ఇప్పటివరకు జరుగలదేని ఇదంతా అమ్మవారి మహిమేనని స్థానిక ప్రజలు అంటున్నారు.

ఇదీ చదవండి: తిరుమలేశుడికి ప్రకృతి సొబగులు

ఇవి కూడా చదవండి: