Home / Cyclone Mocha
:మయన్మార్‌లో మోచా తుఫానుతో మరణించిన వారి సంఖ్య 81 కి చేరింది. ప్రజలు తుఫాను ధాటికి కుప్పకూలిన తమ ఇళ్ల శిధిలాలను తొలగించడానికి ప్రయత్నిస్తున్నారు. పలువురు ప్రభుత్వం సహాయం కోసం వేచి ఉన్నారు.
ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన మోచ తుఫాన్ బంగ్లాదేశ్, మయన్మార్ దేశాలను వణికిస్తోంది. ఈ తుఫాను ఆదివారం మధ్యాహ్నం రెండు దేశాల మధ్య తీరం దాటింది. దీంతో భారీ వర్షాలు కురుస్తున్నాయి
ఇరు తెలుగు రాష్ట్రాల్లో గత కొన్ని రోజులుగా వర్షాలు కురుస్తున్నాయి. ఒకవైపు ఎండ వేడి.. మరోవైపు అకాల వర్షాల కారణంగా తెలంగాణ రాష్ట్రంలో భిన్నమైన వాతావరణం నెలకొంది. ఇదిలా ఉంటే మరోవైపు మోచా తుపాను తీర ప్రాంతంలో బీభత్సం సృష్టిస్తోంది. రాగల 48 గంటల్లో ఆగ్నేయ బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం ఏర్పడుతుందని అధికారులు తెలిపారు.
జనరల్ గా రుతుపవనాలకు ముందు ఏప్రిల్-మే-జూన్ సీజన్‌లో బంగాళాఖాతం లో తరచూ తుపానులు ఏర్పడుతుంటాయి. కానీ మే నెలలో తుపాన్ల ముప్పు మరింత ఎక్కువగా ఉంటుందని వాతావరణ శాఖ వెల్లడించింది.