Home / corona
కరోనా ప్రభావం తగ్గిందనుకున్న ప్రతీ సారీ నేనున్నానంటూ ఎక్కడో దగ్గర తన ఉనికి చాటుకుంటూనే ఉంది కొవిడ్-19. కరోనా మరోసారి దాని విజృంభణను కొనసాగిస్తోంది. కరోనా వేరియంట్లలో అత్యంత ప్రమాదరక, వేగంగా వ్యాప్తి చెందే లక్షణాలున్న ఎక్స్ఎక్స్ బీ వేరియంట్‌ను శాస్త్రజ్ఞులు కనుగొన్నారు. దీనితో చాలా జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు.
కరోనా రోజు రోజుకు పెరుగుతూనే ఉంది బుధ వారం నుంచి వినాయనకుని ఉత్సవాలు, పూజలు ప్రారంభమయ్యాయి.ఇదే క్రమంలో కరోనా కేసులు కూడా పెరిగే అవకాశం ఉందని కేంద్రం ముందస్తూ జాగ్రత్తలు తీసుకుంటుందని తెలిసిన సమాచారం. గడిచిన 24 గంటల్లో కొత్త కేసులు 7, 231 కేసులు వచ్చాయి.
కరోనా వల్ల మనమందరం గడిచిన 3 ఏళ్ళు ఇళ్ళకే పరిమితం అవ్వాలిసి వచ్చింది. ఇది కంటికి కనపడదు కానీ ప్రపంచవ్యాప్తంగా ఇప్పటి వరకు కోట్లాది మంది ఈ కరోనా బారిన పడి కొన్ని లక్షల మంది ప్రాణాలను పోగొట్టుకున్నారు.
కోవిడ్ వ్యాక్సిన్ బూస్టర్ డోస్‌ల నిర్వహణకు ఉన్న గ్యాప్‌ను కేంద్రం బుధవారం 9 నెలలు లేదా 39 వారాల నుంచి 6 నెలలు లేదా 26 వారాలకు తగ్గించింది. 18-59 సంవత్సరాల మధ్య ఉన్న లబ్దిదారులందరికీ 2వ డోస్ ఇచ్చిన తేదీ నుండి 6 నెలలు లేదా 26 వారాలు పూర్తయిన తర్వాత బూస్టర్‌ను అందించాలని నిర్ణయించినట్లు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది.