Home / Consecration Ceremony
శతాబ్దాల ఓర్పు, లెక్కేలేనన్ని త్యాగాలు, తపస్పు తరువాత మన శ్రీరాముడు వచ్చాడని ప్రధాని నరేంద్రమోదీ అన్నారు. సోమవారం అయోధ్యలో బాలరాముడి విగ్రహ ప్రతిష్ట అనంతరం ఆయన ఉద్వేగ భరితంగా ప్రసంగించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ రామమందిరం నిర్మాణం భారత సమాజంలో సహనం, శాంతి మరియు సామరస్యానికి ప్రతీకగా వర్ణించారు.
అయోధ్యలోని రామమందిరం యొక్క ప్రాణ ప్రతిష్ఠ నేపధ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ 11 రోజుల అనుస్టాన్ (దీక్ష) పాటిస్తున్నారు. ఇందులో భాగంగా ఆయన నేలపై నిద్రిస్తూ కేవలం కొబ్బరి నీళ్లు మాత్రమే తాగుతున్నారని సంబంధిత వర్గాలు తెలిపాయి.
అయోధ్యలో శ్రీరాముని విగ్రహం ప్రాణ ప్రతిష్ఠకు తేదీని ప్రకటించిన తర్వాత రామచరిత్ మానస్ కాపీల కోసం విపరీతమైన డిమాండ్ ఏర్పడింది. దీనితో గోరఖ్ పూర్ కు చెందిన గీతా ప్రెస్ గోస్వామి తులసీదాస్ రచించిన ఈ గ్రంధాన్ని తమ వెబ్సైట్లో ఉచితంగా డౌన్లోడ్ చేసుకోవడానికి అందుబాటులో ఉంచాలని నిర్ణయం తీసుకుంది. గీతా ప్రెస్ పబ్లిషింగ్ హౌస్ మేనేజర్ లాల్మణి త్రిపాఠి ఈ విషయాన్ని చెప్పారు.