Home / CM Kejriwal
ఆమ్ ఆద్మీపార్టీ రాజ్యసభ సభ్యుడు రాఘవ్ చద్దా బ్రిటన్ నుంచి ఢిల్లీ చేరుకున్నారు. వెంటనే ఆప్ చీఫ్ కేజ్రీవాల్ ఇంటికి పరామర్శించడానికి వచ్చారు. కాగా కంటి చికిత్స కోసం ఆయన లండన్ వెళ్లారు దీర్ఘకాలం పాటు అక్కడే ఉన్నారు.
ఆమ్ ఆద్మీ పార్టీకి చెందిన రాజ్యసభ సభ్యురాలు స్వాతి మలీవాల్ తనపై ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ నివాసంలో ఆయన అనుచరుడు దాడి చేశాడని పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇదిలా ఉండగా ఢిల్లీ పోలీసులకు సోమవార ఉదయం ఓ కాల్ వచ్చింది. ఆ కాల్లో ఆమ్ఆద్మీపార్టీకి చెందిన నాయకురాలు, రాజ్యసభ ఎంపీ స్వాతిమలీవాల్పై దాడి జరిగిందని సమాచారం ఇచ్చారు
ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో బెయిల్ కోసం చేసుకున్న దరఖాస్తుపై సుప్రీంకోర్టులో మంగళవారం వాదోపవాదాలు జరిగాయి. లోకసభ ఎన్నికల ప్రచారంలో పాల్గొనడానికి తనకు తాత్కాలిక బెయిల్ మంజూరు చేయాలని అరవింద్ కేజ్రీవాల్ సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు. అయితే సుప్రీంకోర్టు మాత్రం కేజ్రీవాల్ మధ్యంతర బెయిల్‌పై ఎలాంటి నిర్ణయాన్ని ప్రకటించలేదు.
అరవింద్ కేజ్రీవాల్ ఆమ్ ఆద్మీ పార్టీ పెట్టి ఊరు పేరు లేని వారికి ఎమ్మెల్యేలతో పాటు మంత్రి పదవులు... రాజ్యసభ సీట్లు అప్పగించారు. అయితే కష్ట కాలంలో వెన్నంటి ఉండాల్సిన సమయంలో తన పార్టీ సహచరులే ఇప్పడు ముఖం చాటేస్తున్నారు. వారిలో ప్రధానంగా చెప్పుకోవాలంటే ఆమ్ ఆద్మీపార్టీకి చెందిన రాజ్యసభ సభ్యుడు రాఘవ చద్దా మొదటివరుసలో ఉన్నాడు. పార్టీలోని ప్రతి ఒక్కరు చద్దా ఎక్కడ అని ప్రశ్నిస్తున్నారు.
ఢిల్లీ పాత రైల్వే బ్రిడ్జి వద్ద నదీ ప్రవాహం క్రమంగా తగ్గుముఖం పట్టడంతో ఉధృతంగా ప్రవహిస్తున్న యమునా నది నీటి మట్టం తగ్గుముఖం పట్టింది. యమునా నది నీటి మట్టం 207.62 మీటర్లుగా నమోదయింది. ఇప్పటికీ ప్రమాద స్థాయి కంటే ఎక్కువగా ఉంది. ఉదయం 11 గంటలకు యమునా నది నీటిమట్టం 207.43 మీటర్లుగా నమోదైంది.యమునా నది నుండి నీరు నగరంలోకి రావడం ఆగిపోయింది. దీనితో నగరంలోని కీలక ప్రాంతాల్లో వరద నీరు నిలిచిపోయింది.
ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఆదివారం అనారోగ్యంతో బాధపడుతున్న ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) నాయకుడు సత్యేందర్ జైన్‌ను ఢిల్లీలోని లోక్ నాయక్ ఆసుపత్రిలో కలిశారు. దాదాపు ఏడాది క్రితం మనీలాండరింగ్ కేసులో అరవింద్ కేజ్రీవాల్ అరెస్టయిన తర్వాత సత్యేందర్ జైన్‌ను కలుసుకోవడం ఇదే తొలిసారి.
పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ మంగళవారం ఢిల్లీలో అధికారుల బదిలీ-పోస్టింగ్‌లపై కేంద్రం ఆర్డినెన్స్‌కు వ్యతిరేకంగా ఆమ్ ఆద్మీ పార్టీ నేతృత్వంలోని ఢిల్లీ ప్రభుత్వానికి మద్దతు ఇచ్చారు.
ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఢిల్లీ పరిపాలన మరియు సేవల విషయాలలో ఎన్నికైన ప్రభుత్వ అధికారాన్ని తగ్గించే కొత్త ఆర్డినెన్స్‌తో కేంద్ర ప్రభుత్వంతో తాజా పోరాటానికి సిద్దమయ్యారు