Home / CM KCR
కేసిఆర్ ప్రభుత్వ పాలనపై ఘాటుగా విమర్శిస్తున్న వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు షర్మిల మరో అడుగు ముందుకేశారు. కాళేశ్వరం ప్రాజెక్టు లో అవినీతి చోటుచేసుకొనిందని కాగ్ కు ఫిర్యాదు చేశారు.
అన్ని ప్రధాన పార్టీల నేతలు ఇప్పటికే మునుగోడు నియోజకవర్గంలో పూర్తి స్థాయిలో ప్రచారాన్ని నిర్వహిస్తున్నారు. ప్రతి గడపకు వెళ్లి ఓటర్లను కలుస్తూ ప్రజలను ప్రసన్నం చేసుకునే పనిలో పడ్డారు. అయితే ఇకపై మునుగోడు రంగంలోకి సీఎం కేసీఆర్ దిగనున్నారని సమాచారం.
తెలంగాణ రాజకీయాలను క్లీన్ స్వీప్ చేసిన కేసీఆర్ ఇప్పుడు జాతీయ రాజకీయాల బాట పట్టారు. తెలంగాణలో రెండు సార్లు అధికారం చేపట్టిన కేసీఆర్ అడుగులు ఇప్పుడు జాతీయ స్థాయికి పడ్డాయి.
కేసీఆర్ తర్వాత తెలంగాణకు కేటీఆర్ సీఎం అవుతారని తెలంగాణ మంత్రి శ్రీనివాస్ గౌడ్ చెప్పారు.
మునుగోడు ఉప ఎన్నికలు అధికార పార్టీ తెరాసకు తలనొప్పులు తెప్పిస్తున్నాయి. ఓవైపు పార్టీ యంత్రాంగం మొత్తం మునుగోడు లో ప్రచారం చేస్తుంటే, మరో వైపు ప్రతిపక్షాలు పదునైన అస్త్రాలను వదులుతూ తెరాస నేతలను పరుగులు పెట్టిస్తున్నారు.
తెలంగాణ సీఎం కేసిఆర్ ఢిల్లీకి ఎందుకు వెళ్లారో తెలియదు. ఆరోగ్యం బాగలేదంటూ అక్కడే తిష్టవేసి పాలన పేరుతో ప్రజాధనాన్ని కేసిఆర్ దుర్వినియోగం చేస్తున్నారని ఫైర్ బ్రాండ్, భాజపా నాయకురాలు విజయశాంతి ఆరోపించారు.
కేంద్ర ప్రభుత్వ పథకాలు, వాటి ప్రయోజనాలు, సబ్సిడీలను ప్రజలకు తెలియకుండా టీఆర్ఎస్ ప్రభుత్వం వ్యవహరించడం దురదృష్టకరమని భాజపా తెలంగాణ అధ్యక్షులు బండి సంజయ్ పేర్కొన్నారు.
వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ మరోసారి ట్విట్టర్ వేదికగా సంచలన వ్యాఖ్యలు చేసారు. అదీ తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు, ఆయన తనయుడు తారక రామారావు (కేటీఆర్)ను సంభోదిస్తూ వాళ్ళ పాలనను తాలిబన్ పాలనతో పోలుస్తూ వర్మ వరుస ట్వీట్లు చేసారు.
మునుగోడు, తెలంగాణలో ఇప్పుడు ఏ రాజకీయ నాయకుడి నోట విన్నా ఇదే పేరు. ఎందుకంటే అక్కడ వచ్చే నెల మూడో తేదీన ఉప ఎన్నిక జరగనుంది.
తెరాస అధినేత, ముఖ్యమంత్రి కేసిఆర్ తన జాతీయ పార్టీ కోసం భారీ నగదు వెచ్చించి ఓ చార్టర్ విమానాన్ని కొనుగోలు చేశారు. దీనిపై ప్రతిపక్షాలు కాలుదువ్వగా, తాజాగా కాంగ్రెస్ నేత బక్క జడ్సన్ ఎన్పోర్స్మెంట్ డైరెక్టరేట్ కు ఫిర్యాదు చేశారు