Home / CM KCR
మొయినాబాద్ ఫాంహౌస్ ఎపిసోడ్లో తన పాత్ర లేదని లక్ష్మీనరసింహస్వామి సాక్షిగా ప్రమాణం చేయాలని సీఎం కేసీఆర్‌కు బండి సంజయ్ సవాల్ విసిరారు.
మొయినాబాద్ ఫాం హౌస్ కేంద్రంగా సాగిన తెరాస ఎమ్మెల్యేల ప్రలోభాల డీల్ ఘటనలో సీఎం కేసిఆర్ పై కేసు నమోదు చేయాలని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి డిమాండ్ చేశారు. సిట్టింగ్ జడ్జి లేదా సీబీఐ తో ఎమ్మెల్యేల కొనుగోలు స్కాంను బయటపెట్టాల్సిన అవసరం ఉందని కేంద్ర మంత్రి స్పష్టం చేశారు.
ప్రజా శాంతి పార్టీ నాయకుడు కేఏ.పాల్ ముఖ్యమంత్రి కేసీఆర్ కు బహిరంగ సవాలు విసిరారు. గత ఎన్నికల్లో ఇచ్చిన హామీల్లో ఎన్ని నెరవేర్చావో చెప్పాకే మునుగోడుకు రండి. నేను మునుగోడు లోనే ఉన్నా, దమ్ముంటే మునుగోడులో బహిరంగ చర్చకి నేను సిద్ధం, నువ్వు సిద్ధమా కేసీఆర్ అంటూ కేఏపాల్ సవాలు విసిరారు.
రాజకీయాలు రాజకీయాలే. ప్రభుత్వం ప్రభుత్వమే. ఇది మరిస్తే ఎవరికైనా పరాభవం తప్పదు. వ్యవస్ధలను అడ్డుపెట్టుకొని పాలన చేస్తున్నారని పదే పదే కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్న తెలంగాణ సీఎం కేసిఆర్ రాజ్యాంగ బద్ధ వ్యవస్ధలను అగౌరపరుస్తున్నారని తెలుసుకోలేకపోతున్నారు.
అవినీతికి కేరాఫ్ అడ్రసుగా నిలిచారంటూ సీఎం కేసిఆర్ పై సీబీఐకి ఫిర్యాదు చేసిన వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్ష్యురాలు వైఎస్ షర్మిల మరో మారు ఆయన పాలనపై మండిపడ్డారు. 8ఏళ్లుగా కేసిఆర్ ఆడింది ఆటగా పాడింది పాటగా సాగిందని విమర్శించారు.
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ దేశ ప్రజలందరికీ దీపావళి పండుగ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేశారు. చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీకగా దీపావళిని దేశవ్యాప్తంగా చిన్నాపెద్ద ప్రతి ఒక్కరూ ఎంతో ఉత్సాహంగా ఆనందంగా జరుపుకుంటారని ఆయన అన్నారు.
మునుగోడు ఉపఎన్నికలకు ముందు తెలంగాణ రాజకీయాల్లో అనూహ్య పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. మొన్నటివరకు బీజేపీలోకి క్యూ కట్టిన నేతలు ఇప్పుడు టీఆర్ఎస్ గూటికి చేరుతున్నారు. గతంలో బీజేపీలో చేరిన మాజీ ఎమ్మెల్యే భిక్షమయ్య గౌడ్, దాసోజ్ శ్రవణ్, స్వామిగౌడ్ ఆ పార్టీకి గుడ్‌బై చెప్పారు.
ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ మునుగోడు ఉప ఎన్నికలో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు.
అన్నదాతలను కేసీఆర్ సర్కార్ కంట నీరు పెట్టిస్తున్నారని భాజపా నాయకురాలు విజయశాంతి అధికార పార్టీపై ధ్వజమెత్తారు. నకిలీ విత్తనాలు, భారీ వర్షా భావంతో రైతులు అప్పుల ఊబిలోకి కూరుకుపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
తెలంగాణలో జరుగుతున్న అవినీతి పై ఢిల్లీ టూర్.