Home / CM KCR
స్వాతంత్రదినోత్సవం సందర్బంగా తెలంగాణ సీఎం కేసీఆర్ గోల్కొండ కోటపై జాతీయ జెండాను ఎగురవేసారు. అనంతరం ఆయన మాట్లాడుతూ వేలాది మంది స్వాతంత్ర సమరయోధులు తమ ప్రాణాలు ఆర్పించి వెలుగును చాటారు. మహానీయుల త్యాగాల వల్లే స్వాతంత్ర ఫలాలు అనుభవిస్తున్నామని చెప్పారు.
తెలంగాణ కేబినెట్ భేటీలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. సీఎం కేసీఆర్ అధ్యక్షతన ఐదు గంటల పాటు సాగిన ఈ భేటీలో పలు అంశాలపై చర్చించారు. 15 ఆగస్టు నుంచి రాష్ట్రంలో కొత్తగా 10 లక్షల పెన్షన్లు మంజూరు చేస్తూ క్యాబినెట్ నిర్ణయించింది. ఇప్పటికే రాష్ట్రంలో ఉన్న 36 లక్షల పెన్షన్ల అందజేస్తోంది.
తెలంగాణ రాష్ట్ర క్యాబినెట్ ఇవాళ సమావేశం కానుంది. ప్రగతిభవన్‌లో మధ్యాహ్నం 3 గంటలకు సీఎం కేసీఆర్ అధ్యక్షతన జరిగే క్యాబినెట్ సమావేశంలో పలు కీలక అంశాలపై చర్చించనున్నారు. ఆజాదీ కా అమృత్ మహోత్సవ్‌లో భాగంగా ఈ నెల 8 నుండి 22వ తేదీ వరకు స్వతంత్ర భారత వజ్రోత్సవాల వేడుకలు జరుగుతున్నాయి.
కేంద్రంపై తెలంగాణ సీఎం కేసీఆర్ మరోసారి విరుచుకుపడ్డారు. నీతి ఆయోగ్ సమావేశాన్ని బహిష్కరిస్తున్నట్లు తెలిపారు. ప్రజాస్వామ్య దేశంలో కేంద్ర ప్రభుత్వ వైఖరి పట్ల నిరసన తెలియజేయడానికి ఇదే ఉత్తమమైన మార్గంగా భావించినట్టు చెప్పారు. తమ నిరసనను బహిరంగ లేఖ ద్వారా నేరుగా ప్రధానికి తెలియజేస్తున్నామని వెల్లడించారు.
దేశభక్తి, స్వాతంత్య్ర పోరాట స్ఫూర్తి ప్రజలందరిలో రగిలేలా స్వతంత్ర భారత వజ్రోత్సవాలను వైభవంగా నిర్వహిస్తామని ముఖ్యమంత్రి కేసీఆర్ తెలిపారు. విద్యార్థులు, ఉద్యోగులు, ఉన్నతాధికారులు, ప్రజాప్రతినిధులు, యువతీ యువకులు సహా యావత్ తెలంగాణ సమాజం ఉత్సాహంగా పాల్గొనాలని పిలుపునిచ్చారు.
తెలంగాణలో వరద బాధిత ప్రాంతాల్లో పర్యటించాక సీఎం కేసీఆర్ మీడియాతో మాట్లాడుతూ భారీ వర్షాలు, వరదల పై సంచలన వ్యాఖ్యలు చేశారు. కడెం ప్రాజెక్టు వద్ద కనీవినీ ఎరుగని వరదను చూశాం. క్లౌడ్ బరస్ట్ కారణంగానే అలా అకస్మాత్తు వరదలు వస్తాయి.
ప్రగతి భవన్, రాజ్ భవన్ మధ్య సైలెంట్ అయిన రాజకీయాలు మళ్ళీ హీట్ ఎక్కాయా? వరద ప్రాంతాల్లో పర్యటించేందుకు గవర్నర్ తమిళ సై సిద్ధమవగానే, సీఎం కెసిఆర్ పర్యటన ఎందుకు ఖరారు అయింది? ... సీఎం ఏరియల్ సర్వే కు రెడీ అయితే, ఏకంగా గవర్నర్ ఫీల్డ్ విజిట్
ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలతో నిర్మల్ జిల్లా కడెం ప్రాజెక్టుకు రికార్డుస్థాయిలో వరద వస్తోంది. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వానలతో గతంలో ఎన్నడూ లేని విధంగా వరదనీరు వచ్చి చేరుతోంది. మంగళవారం రాత్రి నుంచి ప్రాజెక్టుకు వరద ఉధృతి భారీగా కొనసాగుతుంది. వరద నీరు తీవ్రంగా పోటెత్తుతుండటంతో ప్రాజెక్ట్‌లో నీటిమట్టం ప్రమాద స్థాయిలో ఉందని అధికారులు
తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ మౌన దీక్ష ప్రారంభమైంది. పోడు భూములు, గిరిజన సమస్యపై జిల్లాలోని తన కార్యాలయంలో సంజయ్ దీక్షలో కూర్చుకున్నారు. నల్ల బ్యాడ్జీ కట్టుకుని దీక్ష చేపట్టారు. మౌన దీక్ష వేదికపై సీఎం కేసీఆర్ కోసం బీజేపీ నేతలు కుర్చీ వేశారు.
కేసీఆర్ కు అహంకారం తలకెక్కిందని, అందుకే బీజేపీని, ప్రధాని మోదీని ఉద్దేశించి ఇష్టమొచ్చినట్టు మాట్లాడుతున్నారని తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ మండిపడ్డారు. కేసీఆర్ కు సంస్కారం లేదని, దేశ ప్రధానిని ఉద్దేశించి మాట్లాడే మాటలేనా అవి ఆయన నిలదీశారు.