Home / CM KCR
బీఆర్ఎస్ పార్టీగా సీఎం కేసిఆర్ తీసుకొన్న నిర్ణయాన్ని భాజపా ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ ఖండించారు. తెలంగాణ ఉద్యమాన్ని, ఆకాంక్షలను కేసిఆర్ తెగదెంపులు చేసుకొన్నట్లుగా పేర్కొన్నారు
యావత్తు దేశంలో పెద్ద చర్చకు దారితీసిన తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్) పార్టీని జాతీయ పార్టీ గా మారుస్తూ భారత రాష్ట్ర సమితి పార్టీగా జీవం పోసుకొన్న కీలక తరుణంలో మరో వాదం తెరపైకి వచ్చింది. సీఎం కేసిఆర్ కుమార్తె, ఎమ్మెల్సీ కవిత బీఆర్ఎస్ పార్టీ అవిష్కరణ సమయంలో ఆమె గైర్హాజరుపై సర్వత్రా చర్చకు దారితీసింది. నెట్టింట ఎందుకు పాల్గొనలేదనంటూ విభన కధనాలను వ్యాపిస్తున్నారు.
టిఆర్ఎస్ పార్టీని బిఆర్ఎస్ జాతీయ పార్టీగా మారుస్తూ సీఎం కేసిఆర్ తీసుకొన్న నిర్ణయాన్ని ఆయన స్వాగతించారు. కేసిఆర్ తొలి ఆదిపురుష్ అయ్యాడంటూ ట్విట్టర్ వేదికగా వ్యాఖ్యానించారు
తెలంగాణ ప్రజల ఆకాంక్షను సీఎం కేసిఆర్ చంపేశారని, తెలంగాణ పేరుతో ఆర్ధిక బలవంతుడుగా మారాడని టిపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ధ్వజమెత్తారు
యావత్ దేశ ప్రజానికం ఇప్పుడు తెలంగాణవైపు ఆసక్తిగా ఎదురుచూస్తోంది. సీఎం కేసీఆర్ జాతీయ పార్టీని నేడు ప్రకటించనున్నారు. మధ్యాహ్నం 1:19 గంటలకు జాతీయ పార్టీ పేరును కేసీఆర్ ప్రకటించనున్నారు. ఈ నేపథ్యంలో వివిధ రాష్ట్రాలకు చెందిన పలువురు ముఖ్య నాయకులు హైదరాబాద్ చేరుకుని కేసీఆర్కు మద్దతు తెలుపుతున్నారు. కేసీఆర్ జాతీయ రాజకీయాల్లోకి వెళ్తున్న క్రమంలో రాష్ట్రవ్యాప్తంగా టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు సంబురాలు జరుపుతున్నారు.
దసరా సందర్భంగా తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు ప్రగతి భవన్ లో ప్రత్యేక పూజలు నిర్వహించారు.
సారూ...దేశ రాజకీయాల్లోకి ప్రవేశిస్తున్నారు..మజా చేసుకోండి..కుషీగా ఉండండి అంటూ అధికార పార్టీ నేతలు బహిరంగంగా మద్యం, కోళ్లను ఉచితంగా పంచి పెట్టిన ఘటన వరంగల్ జిల్లాలో చోటుచేసుకొనింది.
దసరా రోజు కొత్త పార్టీ ప్రకటన చేయబోతున్న గులాబీ బాస్ఇక స్పీడ్ పెంచనున్నారు. పార్టీ రిజిస్ట్రేషన్ పనులను త్వరగా పూర్తి చేసేలా స్కెచ్ గీసారు. అందుకోసం ఓ టీమ్ ను డిల్లీకి పంపనున్నారు. అందుకు కొత్తగా కొనుగోలు చేసిన విమానాన్ని వినియోగించనున్నారు.
దేశ వ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో 157 మెడికల్ కాలేజీల ఏర్పాటుకు ఆమోదం తెలిపిన కేంద్రం తెలంగాణాకు ఒక్కటి కూడా కేటాయించకపోవడం దురదృష్టకరమని మంత్రి హరీష్ రావు ఆరోపించారు .రాష్ట్రంలో కొత్తగా ఎనిమిది మెడికల్ కాలేజీల్లో అడ్మిషన్లు ప్రారంభించనున్నట్లు మంత్రి హరీష్ మీడియాతో పేర్కొన్నారు.
తెలంగాణ ప్రజలకు బతుకమ్మ పండుగ చివరిరోజు సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలను సీఎం కేసిఆర్ తెలియచేశారు. ఈ మేరకు ఆయన ట్విట్టర్ ద్వారా ప్రజలందరికి అభినందనలు తెలిపారు