Home / CM kcr latest news
టీఆర్ఎస్ పేరును బీఆర్ఎస్ గా మారుస్తూ పంపిన తీర్మానానికి ఎన్నికల సంఘం ఆమోదం లభించిన విషయం తెలిసిందే.
తెలంగాణలోని మా రాజధాని హైదరాబాదుకు వచ్చి తెరాస పార్టీకి చెందిన శాసనసభ్యులను కొంటామంటే చేతులు ముడుచుకొని కూర్చోవాల్నా!? ప్రశ్నేలేదు..తాడో పేడో తేల్చుకొనేందుకు నేను రెడీ అంటూ సీఎం కేసిఆర్ కేంద్ర ప్రభుత్వం, భాజపాపై తీవ్ర విమర్శలు చేశారు.
ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, సమాజ్వాది పార్టీ వ్యవస్థాపకులు ములాయం సింగ్ యాదవ్ సోమవారం మరణించారు. కాగా నేడు ఆయన అంత్యక్రియలు జరుగునున్నాయి ఈ కార్యక్రమానికి సీఎం కేసీఆర్ హాజరుకానున్నారు.
యావత్ దేశ ప్రజానికం ఇప్పుడు తెలంగాణవైపు ఆసక్తిగా ఎదురుచూస్తోంది. సీఎం కేసీఆర్ జాతీయ పార్టీని నేడు ప్రకటించనున్నారు. మధ్యాహ్నం 1:19 గంటలకు జాతీయ పార్టీ పేరును కేసీఆర్ ప్రకటించనున్నారు. ఈ నేపథ్యంలో వివిధ రాష్ట్రాలకు చెందిన పలువురు ముఖ్య నాయకులు హైదరాబాద్ చేరుకుని కేసీఆర్‌కు మద్దతు తెలుపుతున్నారు. కేసీఆర్ జాతీయ రాజకీయాల్లోకి వెళ్తున్న క్రమంలో రాష్ట్రవ్యాప్తంగా టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు సంబురాలు జరుపుతున్నారు.
నేడు సీఎం కేసీఆర్ వరంగల్ జిల్లాలో పర్యటించనున్నారు. రోడ్డు మార్గం ద్వారా హైదరాబాద్ నుంచి వరంగల్‌కు ముఖ్యమంత్రి బయల్దేరారు. ఈ నేపథ్యంలో హైదరాబాద్ టు వరంగల్ వెళ్లే రోడ్డు మార్గంలో పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలను అమలులో ఉంచారు.