Home / CM Chandrababu
AP CM Chandrababu Meeting With Bill Gates In Davos: ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు దావోస్ పర్యటనలో బిజీ బిజీగా గడుపుతున్నారు. రాష్ట్రానికి పెట్టుబడులే లక్ష్యంగా దావోస్ వెళ్లిన చంద్రబాబు మూడో రోజు పలు పారిశ్రామిక వేత్తలతో సమావేశం కానున్నారు. ఈ మేరకు మైక్రోస్టాప్ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్‌తో చంద్రబాబు భేటీ కానున్నారు. రాష్ట్రంలో పెట్టుబడుల విషయంపై ఆయనతో చర్చించనున్నారు. ఇందులో భాగంగానే సీఎం చంద్రబాబు నాయుడు యునీలివర్, డీపీ వరల్డ్ గ్రూప్, పెట్రోలియం […]
CM Chandrababu’s speech in Davos: భారతీయుల రక్తంలోనే వ్యాపార లక్షణాలు ఉన్నాయని, వ్యాపారాల్లో భారతీయులు బాగా రాణిస్తున్నారని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. దావోస్‌లో సీఎం చంద్రబాబు రెండో రోజు పర్యటనలో భాగంగా గ్రీన్ ఇండస్ట్రియలైజేషన్‌పై నిర్వహించిన ప్రపంచ ఆర్థిక సదస్సులో చంద్రబాబు ప్రసంగించారు. ప్రపంచంలో ఎక్కడా చూసిన భారతీయ వ్యాపారవేత్తలే కనిపిస్తున్నారన్నారు. ప్రపంచంలోని అనేక దేశాల్లో రాజకీయ అనిశ్చితి ఉందని, భారత్‌లో ప్రధాని మోదీ నాయకత్వంలో స్థిరమైన ప్రభుత్వం ఉందన్నారు. 2047 నాటికి అభివృద్ధిలో భారత్ […]
CM Chandrababu Visit Mydukur ysr dist: రాజకీయాలకు కొత్త నిర్వచనం తీసుకొచ్చిన ఘనత ఎన్టీఆర్దేనని సీఎం చంద్రబాబు వెల్లడించారు. వైఎస్సార్ జిల్లా మైదుకూరులో ఎన్టీఆర్ వర్ధంతి సభ నిర్వహించారు. ఈ మేరకు ఆయన విగ్రహానికి నివాళులర్పించారు. ఇందులో భాగంగా స్వచ్ఛ ఆంధ్ర స్వచ్ఛ దివాస్ కార్యక్రమానికి సీఎం చంద్రబాబు హాజరయ్యారు. అనంతరం పారిశుద్ధ్య కార్మికులతో సీఎం చంద్రబాబు ముఖాముఖి నిర్వహించారు. అనంతరం ఆయన మాట్లాడారు. తెలుగు ప్రజల గుండెల్లో ఉండే ఏకైక వ్యక్తి ఎన్టీఆర్ అన్నారు. […]
Telugu States CMs Sankranthi Wishes 2025: తెలుగు ప్రజలందరికీ ఇరు రాష్ట్రాల సీఎంలు సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. భోగ భాగ్యాలను అందించే భోగి.. కొత్త కాంతులు తెచ్చే సంక్రాంతి అందరి కుటుంబాల్లో కొత్త వెలుగులు తీసుకురావాలని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఆకాంక్షించారు. అలాగే కనుమ పండుగను అందరూ ఆనందంగా చేసుకోవాలని, పతంగులు ఎగురవేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలని సూచించారు. అలాగే, ప్రతి ఇంట్లో పండుగ శోభ వికసించాలని ఏపీ సీఎం చంద్రబాబు ట్వీట్ చేశారు. సమాజంలో […]
CM Chandrababu Full Speech at Guntur: ఏపీని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తామని ఎన్నికల్లో హామీ ఇచ్చామని, అందుకే రాష్ట్రాన్ని గాడిలో పెడుతున్నామని సీఎం చంద్రబాబు అన్నారు. గుంటూరులో చేబ్రోలు హనుమయ్య కంపెనీ దగ్గర ఏర్పాటు చేసిన నరెడ్కో ప్రాపర్టీ షోను సీఎం చంద్రబాబు ప్రారంభించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. గత ప్రభుత్వం రాష్ట్రాన్ని సమస్యల వలయంగా మార్చేసిందని చంద్రబాబు విమర్శలు చేశారు. మమ్మల్ని నమ్మి 93 శాతం మంది అభ్యర్థులను గెలిపించారని చంద్రబాబు […]
PM Modi Speech At Vishaka Public Meeting: భారత ప్రధాని నరేంద్రమోదీ బుధవారం విశాఖలో పర్యటించారు. ఢిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో సాయంత్రం ఐఎన్ఎస్ డేగకు చేరుకున్న ప్రధానికి రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్, సీఎం చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ తదితరులు ఘన స్వాగతం పలికారు. అనంతరం వేలాది మంది రోడ్డుకు ఇరువైపులా స్వాగతం పలుకుతుండగా, సిరిపురం జంక్షన్ నుంచి సాగిన రోడ్ షోలో ప్రధాని పాల్గొన్నారు. పిదప, విశాఖ […]
CM Chandrababu meeting in palnadu: పల్నాడు జిల్లా నర్సారావుపేట నియోజకవర్గంలో యల్లమందలో పెన్షన్ల పంపిణీలో సీఎం చంద్రబాబు పాల్గొన్నారు. ఈ సందర్బంగా ఎన్టీఆర్ విగ్రహానికి నివాళులర్పించారు. అనంతరం అక్కడ సారమ్మ ఇంటికి వెళ్లిన చంద్రబాబు.. సారమ్మ కూతురికి నీట్ కోచింగ్ ఇప్పించాలని అధికారులకు సూచించారు. అలాగే సారమ్మ కుమారుడికి ఎస్సీ కార్పొరేషన్ ద్వారా లోన్ ఇప్పించాలని చెప్పారు. అలాగే ఏడుకొండలు ఇంటికి వెళ్లిన చంద్రబాబు స్వయంగా ఆ కుటుంబానికి స్వయంగా కాఫీ తయారు చేసి ఇచ్చారు. […]
AP Cabinet Meeting Concluded: ఏపీ కేబినెట్ సమావేశం ముగిసింది. సుమారు 3 గంటలకుపై సమావేశం కొనసాగింది. ఈ మేరకు కేబినెట్ తీసుకున్న నిర్ణయాలను సీఎం చంద్రబాబు నాయుడు వెల్లడించారు. అమరావతిలోరూ.24,276కోట్ల అడ్మినిస్ట్రేషన్ పనులకు సంబంధించిన అనుమతులకు గ్రీన్ సిగ్నల్ లభించింది. ఇందులో భాగంగా రాజధాని నిర్మాణానికి హడ్కో నుంచి రూ.11వేల కోట్లు రుణం, కేఎఫ్‌డబ్ల్యూ ఆర్థిక సంస్థ నుంచి రూ.5వేల కోట్ల రుణాలు తీసుకునేందుకు క్యాబినెట్ ఆమోదం తెలిపింది. దీంతో పాటు పోలవరం ప్రాజెక్టు లెఫ్ట్ […]
Andhra Pradesh CM Chandrababu Naidu to visit Polavaram project: పోలవరం ప్రాజెక్టును ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు సోమవారం సందర్శించారు. ఈ మేరకు ఆయన ప్రాజెక్టు పనులను పరిశీలించారు. అనంతరం ప్రాజెక్టు నిర్మాణ విషయంపై అధికారులు, ఇంజినీర్లతో మాట్లాడనున్నారు. ఇందులో భాగంగానే భూసేకరణ, రిహీబిలిటేషన్పై సీఎం సమీక్షించనున్నారు. ఈ ప్రాజెక్టులో అనేక ఛాలెంజ్స్ నెలకొన్నాయి. ఈ ప్రాంతానికి సంబంధించి నిర్మాణ పనుల విషయంపై నిర్మాణ సంస్థతో మాట్లాడనున్నారు. తొలుత సీఎం చంద్రబాబు ఈసీఆర్ఎఫ్ డ్యాంను […]
CM Chandrababu Holds Conference With District Collectors: రాష్ట్ర అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు, స్వర్ణాంధ్రప్రదేశ్ విజన్-2047, నేతన పాలసీలు, భవిష్యత్ లక్ష్యాలపై కలెక్టర్లకు సీఎం చంద్రబాబు దిశానిర్ధేశం చేశారు. 6 నెలల పాలనలో చేపట్టిన సంక్షేమం, అభివృద్ధి అంశాలపై సచివాలయంలో రెండవ జిల్లా కలెక్టర్ల సమావేశంలో భాగంగా సమీక్ష నిర్వహించారు. ప్రభుత్వ విధానాల చర్చకు కలెక్టర్ల సదస్సు ఉపయోగపడుతుందన్నారు. ప్రతి సంక్షోభంతో అవకాశాలు ఉంటాయన్నారు. ఇలాంటి సంక్షోభంలో అవకాశాలు సృష్టించుకోవడమే నాయకత్వమని వెల్లడించారు. అనంతరం నాలుగున్నరేళ్లు […]