Home / BJP Chief Bandi Sanjay
సీఎం కేసీఆర్ సోమవారం పెద్దపల్లి జిల్లా సమీకృత కలెక్టరేట్ కార్యాలయాన్ని ప్రారంభించారు. ప్రత్యేక పూజులు చేసిన సీఎం కేసీర్ కలెక్టర్ ని కుర్చీలో కూర్చోపెట్టారు. కలెక్టరేట్ లో సర్వమత ప్రార్థనలు నిర్వహించారు. అనంతరం బహిరంగ సభలో సీఎం కేసీఆర్ ప్రసంగించారు.
బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ గారు చేస్తున్న ప్రజా సంగ్రామ యాత్ర ముగింపు సభ 27న జరగాల్సి ఉంది. ఈ నేపథ్యంలో యాత్రలో ఒక్కసారిగా హై టెన్షన్ వాతావరణం కనిపిస్తుంది. ఎమ్మెల్సీ కవిత ఇంటి దగ్గర నిరసనలో బీజేపీ నేతలపై దాడి జరిగిందని, ఆ కారణంగా బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ పాదయాత్రకు బ్రేక్ పడింది.
తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. బీజేపీ కార్యకర్తలపై దాడులకు నిరసనగా, జనగామ జిల్లాలో పాదయాత్రలోనే బండి సంజయ్ దీక్షకు దిగేందుకు సిద్దమైయ్యారు. దీంతో అప్రమత్తమైన పోలీసులు దీక్షకు దిగుతుండగా అరస్ట్ చేశారు.
యాదాద్రి భువనగిరి జిల్లాలో మొదలైన బండి సంజయ్ పాదయాత్ర 1000కిలో మీటర్లు పూర్తి చేసుకుంది.జనగామ జిల్లాలోని అప్పిరెడ్డిపల్లెలో బండి సంజయ్‌కి గ్రామస్థులు ఘన స్వాగతం పలికారు. పాదయాత్ర 1000కిలో మీటర్లు పూర్తైన సందర్భంగా సంజయ్ అప్పిరెడ్డిపల్లెలో పైలాన్ ఆవిష్కరించారు.
తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ మౌన దీక్ష ప్రారంభమైంది. పోడు భూములు, గిరిజన సమస్యపై జిల్లాలోని తన కార్యాలయంలో సంజయ్ దీక్షలో కూర్చుకున్నారు. నల్ల బ్యాడ్జీ కట్టుకుని దీక్ష చేపట్టారు. మౌన దీక్ష వేదికపై సీఎం కేసీఆర్ కోసం బీజేపీ నేతలు కుర్చీ వేశారు.