Home / Bilkis Bano case
బిల్కిస్ బానో కేసులో గుజరాత్ ప్రభుత్వానికి సుప్రీం కోర్టు షాకిచ్చింది. రెపిస్టులను విడుదల చేసే అధికారం గుజరాత్ ప్రభుత్వానికి లేదని స్పష్టం చేసింది. బిల్కిస్ పిటీషన్ కు విచారణ అర్హత ఉందన్న అత్యున్నత న్యాయస్థానం ఈ మేరకు తీర్పు వెలువరించింది. 11 మంది నిందితులను విడుదల చేస్తూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని కొట్టివేస్తూ తీర్పు ఇచ్చింది.
బిల్కిస్ బానో కేసులో దోషులకు క్షమాపణలు మంజూరు చేయడానికి సంబంధించిన ఒరిజినల్ ఫైళ్లతో తాము సిద్ధంగా ఉండాలని మార్చి 27న తాము ఇచ్చిన ఉత్తర్వులను పునఃసమీక్షించాలని కోరుతూ పిటిషన్ దాఖలు చేయవచ్చని కేంద్రం, గుజరాత్ ప్రభుత్వం మంగళవారం సుప్రీంకోర్టుకు తెలిపాయి.
Bilkis Bano: బిల్కిస్ బానో ఈ పేర దేశవ్యాప్తంగా మార్మోగిన పేరు. గోద్రా అల్లర్ల సమయంలో.. సాముహిక అత్యాచారనికి గురై.. ఏడుగురు కుటుంబ సభ్యులను కోల్పోయిన బాధితురాలి పేరు. ఈ కేసులో నిందితులను గుజరాత్ ప్రభుత్వం గతేడాది విడుదల చేసిన విషయం తెలిసిందే.
గుజరాత్ కు చెందిన బిల్కిస్ బానో తనపై సామూహిక అత్యాచారంచేసిన 11 మందిని విడుదల చేయడాన్ని సవాలు చేస్తూ సుప్రీంకోర్టులో రివ్యూ పిటిషన్ దాఖలు చేసింది.
బిల్కిస్ బానో అత్యాచారం కేసులో 11 మంది దోషుల విడుదలకు కేంద్రం ఆమోదం తెలిపిందని గుజరాత్ ప్రభుత్వం వెల్లడించిన మరుసటి రోజు, కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ మోదీపై విమర్శలు గుప్పించారు.
బిల్కిస్ బానో గ్యాంగ్‌రేప్ కేసులో గుజరాత్ ప్రభుత్వం 11 మంది దోషులకు క్షమాబిక్షమంజూరు చేయడాన్ని సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్లపై సుప్రీంకోర్టు గురువారం నోటీసు జారీ చేసింది.
బిల్కిస్ బానో కేసులో ప్రమేయం ఉన్న 11 మంది దోషుల విడుదలను రద్దు చేయాలని మహిళా హక్కుల కార్యకర్తలు మంగళవారం సుప్రీంకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్) దాఖలు చేశారు. ఇది సామూహిక అత్యాచారం, హత్యకు సంబంధించిన కేసు కాబట్టి దోషులను విడుదల చేయరాదని పిఐఎల్‌లో పేర్కొన్నారు.