Bilkis Bano case: బిల్కిస్ బానో కేసులో నిందితుల విడుదలకు వ్యతిరేకంగా పిల్
బిల్కిస్ బానో కేసులో ప్రమేయం ఉన్న 11 మంది దోషుల విడుదలను రద్దు చేయాలని మహిళా హక్కుల కార్యకర్తలు మంగళవారం సుప్రీంకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్) దాఖలు చేశారు. ఇది సామూహిక అత్యాచారం, హత్యకు సంబంధించిన కేసు కాబట్టి దోషులను విడుదల చేయరాదని పిఐఎల్‌లో పేర్కొన్నారు.
New Delhi: బిల్కిస్ బానో కేసులో ప్రమేయం ఉన్న 11 మంది దోషుల విడుదలను రద్దు చేయాలని మహిళా హక్కుల కార్యకర్తలు మంగళవారం సుప్రీంకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్) దాఖలు చేశారు. ఇది సామూహిక అత్యాచారం, హత్యకు సంబంధించిన కేసు కాబట్టి దోషులను విడుదల చేయరాదని పిఐఎల్‌లో పేర్కొన్నారు.
సుభాషిణి అలీ, రేవతి లాల్, రూప్ రేఖా వర్మలు దోషుల విడుదలను రద్దు చేయాలని కోరుతూ సుప్రీంకోర్టులో పిల్ దాఖలు చేశారు. భారత ప్రధాన న్యాయమూర్తి ఎన్వీ రమణ నేతృత్వంలోని ధర్మాసనం ముందు సీనియర్ న్యాయవాది కపిల్ సిబల్, న్యాయవాది అపర్ణ భట్ కూడా ఈ కేసును ప్రస్తావించారు. 14 మంది మరణించారు మరియు గర్భిణీ స్త్రీ పై అత్యాచారం చేశారు. అందువలన నిందితులను విడుదల చేయరాదని కోరారు. ఈ పిటిషన్‌ను పరిశీలించేందుకు సుప్రీంకోర్టు అంగీకరించింది.
అంతకుముందు, ఈ కేసులో దోషుల ముందస్తు విడుదలను రద్దు చేయాలని ఉద్యమకారులు మరియు చరిత్రకారులతో సహా 6,000 మందికి పైగా ప్రజలు సుప్రీంకోర్టును కోరారు.