Home / Bharat Jodo Yatra
కాంగ్రెస్ కు అనూహ్య మైలేజ్ తెప్పిస్తున్న భారత్ జోడో యాత్రలో తన ఫోటో ముద్రించవద్దంటూ ఓ కాంగ్రెస్ సీనియర్ నేత వ్రాసిన లెటరు ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కెర్లు కొడుతోంది.
2016లో వేధింపుల కారణంగా ఆత్మహత్యకు పాల్పడిన హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ దళిత విద్యార్థి రోహిత్ వేముల తల్లి రాధిక మంగళవారం భారత్ జోడో యాత్రలో పాల్గొన్నారు.
కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర భాగ్యనగరంలోకి ప్రవేశించింది. శంషాబాద్ నుండి రాజేంద్రనగర్, బహదూర్ పుర, చార్మినార్, గోషామహల్, నాంపల్లి, కూకట్ పల్లి, శేరిలింగంపల్లి వరకు నగరంలోని ఏడు నియోజకవర్గాల్లో దాదాపు 45 కిలోమీటర్ల వరకు రెండు రోజుల పాటు సాగనుంది.
తెలంగాణలో జరుగుతున్న భారత్ జోడో యాత్రలో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ చేయిలో చేయి వేసి మరీ నడిచి టాలీవుడ్ హీరోయిన్ పూనమ్ కౌర్ వార్తల్లో నిలిచింది.
2023లో అసెంబ్లీ, 2024లో జరిగే పార్లమెంటు ఎన్నికల్లో తెలంగాణాలో కాంగ్రెస్ ఒంటరిగానే పోటీ చేస్తుందని, తెరాస పార్టీతో పొత్తు ఉండదని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ తేల్చి చెప్పారు.
తెలంగాణ ప్రజలకు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి బహిరంగ లేఖ రాశారు. రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్రలో రాజకీయాలకతీతంగా ప్రతి ఒక్కరు పాల్గొనాలని రేవంత్ రెడ్డి విజ్ఞప్తి చేశారు.
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర హైదరాబాద్ నగరంలో నవంబర్ 1న జరగనుంది
తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ధరణిని రద్దు చేస్తామని కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ హామీ ఇచ్చారు. ధరణి పోర్టల్ రైతులకు గుదిబండగా మారిందని రైతు సంఘాల నేతలు రాహుల్ గాంధీ దృష్టికి తెచ్చారు.
రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర పలు రాష్ట్రాల మీదుగా సాగుతూ ఇవాళ హైదరాబాద్కు చేరుకోనుంది. రాహుల్ గాంధీ నేడు భాగ్యనగరంలో అడుపెట్టనున్నాడు. కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు కాంగ్రెస్ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన జోడో యాత్ర ఈ నెల 23న తెలంగాణలోకి ప్రవేశించింది.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజన సమయంలో ఏపీ ప్రజలకు పార్లమెంటులో చేసిన చట్టాలు అందలేదని రాహుల్ గాంధీ పేర్కొన్నారు. కులం, మతం, భాష, ఆహార, వేషధారణల ఆధారంగా భారతీయులను ఒకరికొకరు ఇరకాటంలో పెట్టే ప్రయత్నం సాగుతున్న నేటి తరుణంలో కాంగ్రెస్ పార్టీ భారత్ జోడో యాత్ర చేపట్టింది.