Home / Ayodhya Airport
ప్రధానమంత్రి నరేంద్రమోదీ శనివారం అయోధ్య పట్టణానికి చేరుకుని అభివృద్ధి చేసిన అయోధ్య రైల్వే స్టేషన్ను ప్రారంభించారు. అనంతరం కొత్త విమానాశ్రయాన్ని ప్రారంభించారు.రైల్వే స్టేషన్ నుండి రెండు అమృత్ భారత్ ఎక్స్ప్రెస్ రైళ్లను కూడా ప్రధాని జెండా ఊపి ప్రారంభించారు.
అయోధ్యలో కొత్తగా నిర్మించిన విమానాశ్రయానికి 'మహర్షి వాల్మీకి అంతర్జాతీయ విమానాశ్రయం అయోధ్యధామ్' అని పేరు మార్చనున్నట్లు సంబంధిత వర్గాలుతెలిపాయి. రామాయణ రచయితగా ఖ్యాతికెక్కిన వాల్మీకి పేరును పెట్టడం సముచితంగా ఉంటుందని భావించారు.
అయోధ్యలో వచ్చే జనవరిలో శ్రీరామ మందిరం ప్రారంభోత్సవం జరగనున్న విషయం తెలిసిందే. అయితే రామమందిరం ప్రారంభానికి ముందే ఈ డిసెంబర్లో అయోధ్య కొత్త విమానాశ్రయం నుండి విమానాల రాకపోకలు ప్రారంభమయే అవకాశముందని అధికార వర్గాలు తెలిపాయి.