Ayodhya Airport: డిసెంబర్ లో అయోధ్య విమానాశ్రయం ప్రారంభం
అయోధ్యలో వచ్చే జనవరిలో శ్రీరామ మందిరం ప్రారంభోత్సవం జరగనున్న విషయం తెలిసిందే. అయితే రామమందిరం ప్రారంభానికి ముందే ఈ డిసెంబర్‌లో అయోధ్య కొత్త విమానాశ్రయం నుండి విమానాల రాకపోకలు ప్రారంభమయే అవకాశముందని అధికార వర్గాలు తెలిపాయి.
Ayodhya Airport: అయోధ్యలో వచ్చే జనవరిలో శ్రీరామ మందిరం ప్రారంభోత్సవం జరగనున్న విషయం తెలిసిందే. అయితే రామమందిరం ప్రారంభానికి ముందే ఈ డిసెంబర్‌లో అయోధ్య కొత్త విమానాశ్రయం నుండి విమానాల రాకపోకలు ప్రారంభమయే అవకాశముందని అధికార వర్గాలు తెలిపాయి. తొలి దశలో ఢిల్లీ, ముంబయి, బెంగళూరు, హైదరాబాద్‌లకు విమాన సర్వీసులు ప్రారంభవుతాయి. ప్రస్తుతమున్న విమానాశ్రయాన్ని దాదాపు ఐదు రెట్లు విస్తరించే యోచనలో కేంద్రం ఉంది.
విస్తరణ ప్రణాళిక..( Ayodhya Airport)
.అయోధ్య విమానాశ్రయాన్ని ‘మర్యాద పురుషోత్తం శ్రీ రామ్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్’ అని పిలుస్తారు. ప్రస్తుత విమానాశ్రయం 6250 చ.మీ విస్తీర్ణంలో టెర్మినల్ భవనం కలిగి ఉంది. ఇది పీక్ అవర్స్‌లో 500 మంది ప్రయాణీకులు సౌకర్యవంతంగా ఉండేలా . 2,200 మీటర్ల రన్‌వే మరియు నాలుగు విమానాలను పార్క్ చేయగల సామర్థ్యం కలిగి ఉంటుంది. ప్రాజెక్ట్ యొక్క ప్రతిపాదిత దశ-2 చాలా పెద్దదిగా ఉంటుంది. ఇది 30,000 చ.మీ విస్తీర్ణంలో కొత్త టెర్మినల్ భవనాన్ని కలిగి ఉంటుంది, ఇది పీక్ అవర్స్‌లో మొత్తం 3,200 మంది ప్రయాణికులకు సేవలను అందించగలదు. ఫేజ్-2లో రన్‌వే 2,200 మీ నుండి 3,125 మీ వరకు పొడిగింపు మరియు ఎనిమిది A-321 రకం విమానాలను పార్క్ చేయడానికి ఆప్రాన్ పొడిగింపు కూడా ఉంటుంది. ప్రాజెక్టు రెండవ దశ కు పర్యావరణ అనుమతులు కూడా మంజూరయ్యాయి. విస్తరించిన విమానాశ్రయం మరియు పెద్ద రన్‌వే కోసం యుద్ధ ప్రాతిపదికన భూమిని సేకరిస్తున్నట్లు ఉత్తరప్రదేశ్ ప్రభుత్వ అధికారులు తెలిపారు. ఇది పూర్తయిన తరువాత మరిన్ని మెట్రో నగరాల నుంచి విమాన సర్వీసులను ప్రారంభిచాలని అధికారులు భావిస్తున్నారు.