Home / Assembly
AP Assembly : విద్యకు కూటమి సర్కారు అత్యంత ప్రాధాన్యతనిస్తోందని మంత్రి నారా లోకేశ్ అన్నారు. ఏపీ ప్రైవేట్ విశ్వవిద్యాలయాల స్థాపన, క్రమబద్ధీకరణ చట్ట సవరణ బిల్లును మంత్రి శాసన సభలో ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. విశాఖపట్నంలో ఏఐ, స్పోర్ట్స్ యూనివర్సిటీలు ఏర్పాటు చేసే యోచనలో ఉన్నామని మంత్రి చెప్పారు. 2016 ప్రైవేట్ యూనివర్సిటీల బిల్లు తీసుకొచ్చామని తెలిపారు. బిల్లులో లోపాలు సరిదిద్ది కొత్త చట్టం తెస్తామని స్పష్టం చేశారు. ఎన్సీసీకి సంబంధించిన ప్రత్యేక […]
CM Revanth Reddy : కేసీఆర్‌కు, బీజేపీకి విజ్ఞప్తి చేస్తున్నా.. అందరం కలిసి త్వరలో ప్రధాని మోదీ దగ్గరకు వెళ్లి అవసరమైతే రాజ్యాంగ సవరణ చేసైనా సరే బీసీ రిజర్వేషన్లకు చట్టబద్ధత సాధించుకుందామని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పిలుపునిచ్చారు. ఇవాళ శాసనసభలో బీసీ బిల్లుపై మాట్లాడారు. బిల్లుకు సహకరించిన వారికి ఆయన ధన్యవాదాలు తెలిపారు. బీసీ రిజర్వేషన్ల సాధన కోసం బీఆర్ఎస్, బీజేపీ, ఎంఐఎం, సీపీఐతోపాటు అన్నిరాజకీయ పార్టీలను కలుపుకొని పోతామని చెప్పారు. ఏ వివాదాలకు తావు లేకుండా […]
Chandrababu : 2047 ఏడాది నాటికి మన దేశం 30 ట్రిలియన్ డాలర్ల జీడీపీకి చేరాలని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆకాంక్షించారు. ఇవాళ శాసనసభలో స్వర్ణాంధ్ర విజన్ -2047 డాక్యుమెంట్‌పై చర్చ సందర్భంగా సీఎం మాట్లాడారు. నియోజకవర్గ విజన్ డాక్యుమెంట్ అమలుపరిచే బాధ్యత ఎమ్మెల్యేలదేనని స్పష్టం చేశారు. ఎమ్మెల్యేలకు పూర్తిగా సహకరిస్తామని చెప్పారు. 2047 వరకు రాష్ట్ర తలసరి ఆదాయం రూ.55 లక్షలు సాధించేలా విజన్ డాక్యుమెంట్ రూపొందించామన్నారు. అప్పటి వరకు 2.4 ట్రిలియన్ల ఆర్థిక […]
Pawan Kalyan : ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు కొనసాగుతున్నాయి. ఉపాధి హామీ పథకంలో జరిగిన అవినీతికి సంబంధించి శాసనసభలో సభ్యులు అడిగిన ప్రశ్నలకు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ సమాధానం ఇచ్చారు. జాతీయ ఉపాధి హామీ పథకంపై ప్రత్యేక దృష్టి పెట్టినట్లు తెలిపారు. జాతీయ ఉపాధి హామీ రాజకీయ ఉపాధి హామీ పథకం అయ్యిందని సభ్యులు అన్నారని, గత వైసీపీ ప్రభుత్వంలో జరిగిందని, ఎన్డీఏ ప్రభుత్వంలో కాదని స్పష్టం చేశారు. పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా బాధ్యతలు తీసుకున్న […]
Revanth Reddy : రెండు తెలుగు రాష్ట్రాల్లో ఒకే పేరుపై యూనివర్సిటీలు, సంస్థలు ఉంటే పరిపాలనా పరమైన సమస్యలు ఉత్పన్నమయ్యే అవకాశం ఉందని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అన్నారు. సమస్యను పరిష్కరించేందుకే తెలంగాణలోని యూనివర్సిటీలు, సంస్థలకు రాష్ట్రానికి సంబంధించిన పేర్లు పెడుతున్నామని చెప్పారు. ఇవాళ శాసనసభలో ఎస్సీ వర్గీకరణ, బీసీ రిజర్వేషన్, తెలుగు వర్సిటీ పేరు మార్పు తదితర బిల్లులు ప్రవేశపెట్టిన నేపథ్యంలో సీఎం మాట్లాడారు. చర్లపల్లి రైల్వే టెర్మినల్‌కు పొట్టి శ్రీరాములు పేరు పెట్టాలని కేంద్రానికి ప్రతిపాదిస్తున్నట్లు […]
CM Revanth Reddy : స్టేచర్‌పై తాను మాట్లాడిన మాటలకు కట్టుబడి ఉన్నానని సీఎం రేవంత్‌రెడ్డి స్పష్టం చేశారు. ఇవాళ ఆయన మండలిలో మాట్లాడారు. ప్రధాన ప్రతిపక్ష నేత కేసీఆర్ నిండు నూరేళ్లు సంపూర్ణ ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. ఎమ్మెల్యేలు సభ్యులు కూడా ప్రభుత్వ ఉద్యోగులేనని సుప్రీంకోర్టు చెప్పిన విషయాన్ని ఈ సందర్భంగా సీఎం గుర్తు చేశారు. ఎమ్మెల్యేగా కేసీఆర్ రూ.57 లక్షల జీతం తీసుకుంటున్నారని, అసెంబ్లీకి రావటం లేదన్నారు. ప్రభుత్వానికి సూచనలు […]
Harish Rao : ప్రత్యేక తెలంగాణ కోసం ప్రాణాలు పణంగా పెట్టిన కేసీఆర్ చావు కోరుకోవడం తప్పు అని మాజీ మంత్రి తన్నీరు హరీశ్‌రావు అన్నారు. పదేండ్లు ముఖ్యమంత్రిగా ఉన్న కేసీఆర్ చావును రేవంత్ కోరుకున్నారని, అందుకే ఇవాళ శాసనసభలో ముఖ్యమంత్రి స్పీచ్‌ను బహిష్కరించామన్నారు. అసెంబ్లీలో మీడియాతో చిట్ చాట్ నిర్వహించి మాట్లాడారు. కృష్ణా జలాల్లో రాష్ట్రానికి జరిగిన అన్యాయానికి కారణం కాంగ్రెస్సే అని ఆరోపించారు. మంత్రి ఉత్తమ్ సభలో పచ్చి అబద్ధాలు మాట్లాడారని ధ్వజమెత్తారు. కాంగ్రెస్ […]
TG Assembly : సీఎం రేవంత్‌రెడ్డి ప్రసంగాన్ని బీఆర్ఎస్ సభ్యులు బహిష్కరించారు. గవర్నర్ ప్రసంగానికి ధన్యావాదాలు తెలిపే తీర్మానంపై ముఖ్యమంత్రి సమాధానం ఇస్తున్న సందర్భంగా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు సభ నుంచి వాకౌట్ చేశారు. బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ చావును కోరుకున్న నాయకుడి ప్రసంగాన్ని తాము బహిష్కరిస్తున్నామని వాకౌట్కు ముందు ప్రకటించారు. బీఆర్ఎస్ పార్టీ స్టేచర్‌పై నుంచి మార్చురీకే అని వ్యాఖ్యానించడం, తెలంగాణ సాధకుడు, 10 ఏండ్లు రాష్ట్రాన్ని ప్రగతిపథంలో నడిపిన పాలనాధక్షుడు అయిన కేసీఆర్ చావును […]
Telangana Assembly : కులానికి ఎక్కడా స్టేచర్ ఉండదని, మీకు మీరుగా స్టేచర్‌ను ఆపాదించుకోవద్దని బీఆర్ఎస్ నేతలను ఉద్దేశించి ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి హాట్ కామెంట్స్ చేశారు. ఇవాళ అసెంబ్లీలో గవర్నర్ ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై చర్చలో భాగంగా మాట్లాడారు. గవర్నర్‌ను గౌరవించడం లేదని, స్పీకర్‌ను బీఆర్ఎస్ సభ్యులు గౌరవించడం లేదని ఫైర్ అయ్యారు. బీఆర్ఎస్ నేతలు ఎందుకిలా బరితెగిస్తున్నారని మండిపడ్డారు. అజ్ఞానాన్నే విజ్ఞానం అనేలా వ్యవహరిస్తున్నారన్నారు. కులానికి స్టేచర్ ఉండదని, ఒక్క పదవికి మాత్రమే స్టేచర్ ఉంటుందని, […]
Telangana Assembly : తెలంగాణ అసెంబ్లీలో జరిగిన ఘర్షణాకర పరిణామాల నేపథ్యంలో మాజీ మంత్రి, సూర్యపేట ఎమ్మెల్యే జగదీశ్‌రెడ్డిని బడ్జెట్ సమావేశాలు ముగిసేంత వరకు సస్పెండ్ చేస్తూ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ కీలక నిర్ణయం తీసుకున్నారు. సభలో స్పీకర్‌ను ఉద్దేశించి మాట్లాడారు. తాము ఎన్నుకుంటేనే మీరు స్పీకర్ అయ్యారని, సభ మీ సొంత కాదని జగదీశ్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. జగదీశ్‌రెడ్డి వ్యాఖ్యలపై కాంగ్రెస్ సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ క్రమంలోనే […]